- Telugu News Photo Gallery Business photos PM Kisan Yojana, Still not received 18th installment? not credit 2000 rupees on your bank account Then
PM Kisan: పీఎం కిసాన్ 18వ విడత ఇంకా అందలేదా? ఇలా ఫిర్యాదు చేయండి!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 17వ విడత అందుకున్న రైతులు.. ఇప్పుడు 18వ విడత అందుకుంటున్నారు. రైతుల ఖాతాల్లో రూ.2000 డిపాజిట్ అవుతున్నాయి. అందులో రూ.9.4 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ కాగా, రూ.20 వేల కోట్లు..
Updated on: Oct 07, 2024 | 3:17 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 17వ విడత అందుకున్న రైతులు.. ఇప్పుడు 18వ విడత అందుకుంటున్నారు. రైతుల ఖాతాల్లో రూ.2000 డిపాజిట్ అవుతున్నాయి. అందులో రూ.9.4 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ కాగా, రూ.20 వేల కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి.

పీఎం కిసాన్ పథకంలో e-KYC తప్పనిసరి. బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయాలి. ఇ-కెవైసి పూర్తి చేసిన రైతులు 18వ విడత ప్రయోజనం పొందుతారు.

18వ వాయిదా మీ ఖాతాలో జమ కాకపోతే అందుకు కారణాలు తెలుసుకోవాలి. అందుకే ముందుగా మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోండి.


pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి "ఫార్మర్స్ కార్నర్"లో "బెనిఫిషియరీ స్టేటస్" బాక్స్‌పై క్లిక్ చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఇక్కడ నమోదు చేయండి. ప్రక్రియ పూర్తయిన తర్వాత గెట్ డేటాపై క్లిక్ చేయండి. మీ ఖాతా స్థితి కనిపిస్తుంది.

రైతులు ఏదైనా కారణంగా ఈ వాయిదా రాకపోతే ఫిర్యాదు కూడా చేయవచ్చు. ల్ప్‌లైన్ నంబర్ - 155261 లేదా టోల్ ఫ్రీ నంబర్ - 1800115526, 011-23381092కు కాల్ చేయవచ్చు. రైతులు pmkisan-ict@gov.in ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు.




