యమహా కూడా రేయ్‌జెడ్‌ఆర్ పేరుతో స్కూటర్‌ను లాంచ్ చేసింది. 125 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ స్కూటర్ 8.08 బీహెచ్‌పీ పవర్‌తో, 10.3 ఎన్‌ఎం టార్క్‌తో ఆకర్షణీయంగా ఉంది. ఈ స్కూటర్ కూడా లీటర్‌కు 68 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. డ్రమ్, డిస్క్ బ్రేక్‌ల వేరియంట్‌లతో వచ్చే ఈ స్కూటర్ ధరలు వరుసగా రూ.84,730(ఎక్స్-షోరూమ్), రూ.90,830 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.