- Telugu News Photo Gallery Business photos Investment tips sbi gold fund or physical gold where will you get more return details in telugu
Gold Investment: సిరులు కురిపిస్తున్న పసిడి.. ఆ రెండింటి మధ్య ప్రధాన తేడా ఇదే..!
ప్రపంచవ్యాప్తంగా పెరిగిన అనిశ్చితి కారణంగా బంగారం ధరలు తారాస్థాయికు చేరాయి. శతాబ్దాలుగా బంగారం ప్రజలకు అత్యంత ఇష్టపడే పెట్టుబడిగా ఉంది. స్టాక్ మార్కెట్ పనితీరులో అస్థిరత కారణంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితి, ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినమైన సుంకాల వైఖరి కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నయాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక బంగారం కొనుగోలు చేయడం ఉత్తమమా? లేక గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కొనడం ఉత్తమమా? అనే విషయం పెట్టుబడిదారులను గందరగోళానికి గురి చేస్తుంది. ఈ నేపత్యంలో బంగారంలో పెట్టుబడి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Srinu |
Updated on: Mar 21, 2025 | 4:22 PM

ఎస్‌బీఐ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ఈ ఫండ్ 1 సంవత్సరం కాలంలో 32.52 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. దాని నిర్వహణలో ఉన్న ఆస్తులు రూ. 3,225 కోట్లు కాగా మార్చి 17, 2025 నాటికి దాని నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ) రూ. 27.15గా ఉంది.

జనవరి 2013లో ప్రారంభించినప్పటి నుంచి ఈ ఫండ్ భౌతిక బంగారం ధరతో పోలిస్తే 7.88 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. 0.1 శాతం వ్యయ నిష్పత్తితో ఈ ఫండ్‌లో కనీస ఎస్ఐపీ పెట్టుబడి రూ.500, కనీస ఏకమొత్తం పెట్టుబడి రూ. 5,000 ఉంటుంది. ఎస్‌బీఐ గోల్డ్ ఫండ్లో రూ.3 లక్షల పెట్టుబడి విలువను ఒకే సంవత్సరంలో ఏక మొత్తంలో పెట్టుబడి పెడితే అది రూ.3.98 లక్షలకు పెరుగుతుంది.

గత సంవత్సరంలో భౌతిక బంగారం ధర రెండు ప్రధాన కారణాల వల్ల పెరిగింది. సెన్సెక్స్‌తో పాటు నిఫ్టీ 50 అస్థిరంగా పనిచేస్తున్న సమయంలో ప్రజలు బంగారంలో పెట్టుబడి పెట్టారు. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలపై ట్రంప్ వాణిజ్య సుంకాలను విధించడం ఫలితంగా బంగారం ధర వేగంగా పెరుగుతుంది. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధరను పోల్చి చూస్తే, ఒక సంవత్సరంలో అది 17.70 శాతం పెరిగి రూ.76,590 నుండి రూ.90,150కి చేరుకుంది.

ఒక సంవత్సరం క్రితం ఒక కొనుగోలుదారుడు రూ. 3,00,000 పెట్టుబడితో సుమారు 39.17 గ్రాముల 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేస్తే నేటి ధర ప్రకారం, అదే కొనుగోలుదారుడు అదే మొత్తానికి 33.30 గ్రాములు కొనుగోలు చేయవచ్చు.

కాబట్టి, 1 సంవత్సరం క్రితం చేసిన 3 లక్షల రూపాయల పెట్టుబడి దాదాపు రూ.3,53,117.55 రూపాయలను ఇస్తుంది. మీరు 1 సంవత్సరం లోపు ఎస్‌బీఐ గోల్డ్ ఫండ్లో రూ. 3,00,000 పెట్టుబడి పెడితే అది భౌతిక బంగారం కంటే ఎక్కువ రాబడిని ఇస్తుందని ఫలితం చూపిస్తుంది.





























