Indian Railways: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాదిలోనే పరుగులు.. ఎప్పుడంటే..?

Updated on: Jun 11, 2026 | 3:49 PM

ఇండియాలో తొలి బుల్లెట్ రైలు ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంపై స్పష్టత వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. వచ్చే ఏడాదిలోనే మొట్టమొదటి రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.

1 / 5
ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ఏడు మార్గాల్లో హైస్పీ్డ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను నిర్మించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పనులను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సన్నద్దమవుతోంది. అలైన్ మెంట్ సర్వే, డీపీఆర్ తయారీ, భూసేకరణ, టెండర్ల ప్రక్రియ వంటి పనులను చేపడుతోంది. ఈ క్రమంలో తొలి బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానిపై దేశ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

2 / 5
దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న తొలి రైలును ప్రారంభించాలని కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ మార్గంలో తొలి రైలు పరుగులు పెట్టనుంది. జపాన్‌కు చెందిన షింకన్సెస్ టెక్నాలజీ ఆధారంగా పనులు చేపడుతున్నారు. ఇప్పటికే బుల్లెట్ రైళ్లు ఎలా ఉంటాయనే దానిపై కేంద్రం నమూనాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

3 / 5
ముంబై-అహ్మదాబాద్ కారిడార్ మొత్తం 508 కిలోమీటర్ల మేర ఉంటుంది. తొలి బుల్లెట్ ట్రైన్ ఈ మార్గంలోనే రానుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా 2027, ఆగస్ట్ 15న తొలి రైలును ఈ మార్గంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ముంబై-అహ్మదాబాద్ మధ్య రెండు గంటల్లోపే చేరుకోవచ్చు.

4 / 5
బుల్లెట్ రైళ్ల వేగం, సమయపాలన, ప్రాజెక్ట్ మొత్తం షింకన్సెస్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ కారిడార్‌లో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి. అహ్మదాబాద్, సబర్మతి, ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి, బోయిసర్, థానే, ముంబై స్టేషన్లను ప్రతిపాదించారు. ఈ మార్గంలో నడిపించేందుకు తొలి బుల్లెట్ రైలుును బీఈఎంఎల్ అభివృద్ది చేస్తోంది. మేడ్ ఇన్ ఇండియా బీ28 రైలు సెట్ తయారుచేస్తున్నారు.

5 / 5
దేశీయ సాంకేతికత ఆధారంగా బుల్లెట్ ట్రైన్ అభివృద్ది చేస్తున్నారు. 2029 నాటికి అహ్మదాబాద్-ముంబై కారిడార్ పనులన్నీ పూర్తి కానున్నాయి. దశలవారీగా పనులను పూర్తి చేయనున్నారు. పూర్తయిన కొంత మార్గంలో బుల్లెట్ రైళ్లను తొలుత నడపనున్నారు.

Follow Us