AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ఫోన్‌లో పెద్ద సౌండ్ పెట్టేవారికి రైల్వేశాఖ హెచ్చరిక.. రూల్స్ అన్నీ మారాయ్.. ఇక చిప్పకూడు తప్పదు..

రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు చాలామంది తమ ఫోన్‌లో పెద్దగా సౌండ్ పెట్టి వీడియోలు చూడటం, సాంగ్స్ వినడం చేస్తూ ఉంటారు. ఇలాంటివారికి రైల్వేశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై పెద్దగా సౌండ్ పెట్టి తొటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

Venkatrao Lella
|

Updated on: Oct 19, 2026 | 6:05 PM

Share
ఇండియాలో రైలు ప్రయాణం ఎక్కువమంది చేస్తుంటారు. తక్కువ ధరలతో దూర ప్రాంతాలకు సౌకర్యవంతంగా వీటిల్లో ప్రయాణించవచ్చు. రైలు ప్రయాణం చేసేటప్పుడు చాలామంది కాలక్షేపం కోసం సాంగ్స్ వినడం, సినిమాలు చూడటం, ఏవైనా వీడియోలు చూడటం లాంటివి సాధారణంగా చేస్తుంటారు. కొంతమంది ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ లాంటివి వాడితే.. మరికొంతమంది అలాంటివేవీ ఉపయోగించకుండా ఫోన్ స్పీకర్లను ఉపయోగించుకుంటారు. ఫోన్ స్పీకర్లలో బిగ్గరగా సౌండ్  పెట్టడం వల్ల తొలి ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతారు.

1 / 5
రైల్వేశాఖ కొత్త నిబంధలను అమల్లోకి తీసుకొచ్చింది. పెద్దగా ఫోన్ సౌండ్ పెట్టి తొటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేవారికి హెచ్చరికలు జారీ చేసింది. రూ.5 వేల వరకు జరిమానా విధిస్తారు. తొలిసారి రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. ఇక పదే పదే నిబంధనలు ఉల్లంఘించేవారికి రూ.5 వేల జరిమానాతో పాటు 6 నెలల జైలుశిక్ష కూడా పడే అవకాశముంది.

2 / 5
రైలు ప్రయాణం చేసే సమయంలో ఫోన్ స్పీకర్ల ద్వారా పెద్దగా సౌండ్ పెట్టి ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని రైల్వేశాఖ సూచించింది. ఇతరుల సౌకర్యాలను గౌరవించాలని, వారి ప్రయాణానికి, విశ్రాంతికి ఆటంకం కలిగించవద్దని హెచ్చరించింది. ఇయర్ ఫోన్లు, ఇయర్ బడ్స్‌ను ఉపయోగించుకోవాలని, బిగ్గరగా సౌండ్లు పెట్టవద్దని సూచించింది. ట్రైన్లలోనే కాకుండా రైల్వే స్టేషన్లలో కూడా ఈ నిబంధనలు పాటించాలని కోరింది.

3 / 5
రైల్వే స్టేషన్లు, ట్రైన్ల లోపల, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులకు ఈ విషయాన్ని తెలియజేయాలని రైల్వే డివిజన్లకు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ ఫోన్లలో పెద్దగా మాట్లాడవద్దని, పెద్ద రింగ్ టోన్‌ల ద్వారా ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణికులు తమ ఫోన్‌లను సైలెంట్ లేదా వైబ్రేషన్ మోడ్‌లో ఉంచుకోవాలంది.

4 / 5
రింగ్‌టోన్ వాల్యూమ్‌లను తగ్గించుకోవాలని, కాల్స్‌లో బిగ్గరగా మాట్లాడవద్దని రైల్వేశాఖ తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వ్యక్తిని రైల్వే స్టేషన్ నుంచి బయటకు పంపించవచ్చు. ఇక టికెట్‌ను కూడా స్వాధీనం చేసుకోవచ్చు. ఈ మేరకు రైల్వే అధికారులకు అధికారాలు అప్పగించింది.

5 / 5
Follow Us