Savings Account: బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు? ఈ లిమిట్ దాటితే..!

| Edited By: Ravi Kiran

May 10, 2024 | 9:57 PM

భారతదేశంలో ఇటీవల రోజుల్లో బ్యాంకు ఖాతా వాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంతో పాటు టెలికాం రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా పొందడం సులభం అయ్యింది. అలాగే ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాల లబ్ధిని బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుండడంతో బ్యాంకు ఖాతాల ప్రాముఖ్యత పెరిగింది. ముఖ్యంగా డబ్బులు ఇంట్లో దాచుకుంటే దొంగల భయం కారణంగా బ్యాంకు ఖాతాల్లో పొదుపు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సాధారణంగా అందరికీ ఓ అనుమానం ఉంటుంది. అసలు మన బ్యాంక సేవింగ్స్ ఖాతాలో ఎంత డిపాజిట్ చేయవచ్చు? డిపాజిట్ పరిమితి ఎంత? అనే అనుమానం అందరికీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు సేవింగ్స్ ఖాతాలో? ఎంత డిపాజిట్ చేయవచ్చో? ఓ సారి తెలుసుకుందాం.

1 / 5
రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌ ఆదాయ వివరాలను అడిగే అవకాశం ఉంది. వారు మీ సమాధానంతో సంత‌ప్తి చెందకపోతే దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఒక వేళ విచారణలో పట్టుబడితే 60 శాతం సొమ్మును జరిమానా కింద వసూలు చేసే అవకాశం ఉంది.

2 / 5
పొదుపు ఖాతాలో సొమ్మును పొదుపు చేసేందుకు ఎలాంటి పరిమితి లేదు. కానీ ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ సొమ్ము డిపాజిట్ చేస్తే ఆ విషయాన్ని సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌కు తెలియజేయాలి.

3 / 5
పొదుపు ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్ము ఆదాయపు పన్ను పరిధిలోకి దానికి సంబంధించిన సమాచారం ఆదాయపు పన్ను శాఖకు ఇవ్వాలి. అలాగే ఆదాయ వనరుల వివరాలను కూడా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి.

4 / 5
భారతదేశం జనాభాలో దాదాపు 80 శాతం మంది ప్రజలకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. భారతదేశంలో యూపీఐ రాకతో డిజిటల్ పేమెంట్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా దేశంలో చిల్లర సమస్యకు పరిష్కారం దొరికింది.

5 / 5
పొదుపు ఖాతాలో ఎక్కువ మొత్తంలో సొమ్ము ఉంచుకోవడం మంచి చర్య కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ కచ్చితంగా డబ్బును ఖాతాల వంటి సురక్షిత మార్గాల్లో ఉంచాలంటే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టాలని చెబుతున్నారు.