Hero XPulse 200 4V: హీరో మోటోకార్ప్‌ నుంచి మరో సరికొత్త బైక్‌.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతో తెలుసా..?

|

Oct 09, 2021 | 1:18 PM

Hero XPulse 200 4V: హీరో మోటోకార్ప్‌ మార్కెట్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కస్టమర్లకు అనుగుణంగా సరికొత్త ద్విచక్ర వాహనాలను తయారు చేస్తూ మార్కెట్లో విడుదల ..

1 / 5
Hero XPulse 200 4V: హీరో మోటోకార్ప్‌ మార్కెట్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కస్టమర్లకు అనుగుణంగా సరికొత్త ద్విచక్ర వాహనాలను తయారు చేస్తూ మార్కెట్లో విడుదల చేస్తోంది. ఇక తాజాగా ఈ హీరో  'ఎక్స్‌ప్లస్‌ 200 4వీ'ని విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.28 లక్షలుగా వెల్లడించింది కంపెనీ.

2 / 5
అడ్వెంచర్‌ మోటార్‌ సైక్లింగ్‌లో ఎంట్రి లెవల్‌ వాహనమైన ఎక్స్‌ప్లస్‌కు 4 వాల్వ్‌ టెక్నాలజీని వినియోగించింది. దీనికి 199.6 సీసీ సింగిల్‌ సిలిండర్‌, ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 18.8 బీహెచ్‌పీ శక్తిని, 17.35 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను విడుదల చేస్తుంది.

3 / 5
గతంలో ఉన్న టూవాల్స్‌ టెక్నాలజీ ఇంజిన్‌ 17.8 బీహెచ్‌పీ శక్తిని మాత్రమే విడుదల చేస్తుండగా, కొత్త ఇంజిన్‌తో శక్తి ఆరు శాతం, టార్క్‌ ఐదు శాతం పెరిగాయి. ధరలో కూడా రూ.5000 ఎక్కువ.

4 / 5
అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ  సరికొత్త బైక్‌లో కూలింగ్‌ వ్యవస్థను కూడా 7ఫిన్‌ ఆయిల్‌ ఫిల్టర్లతో మరింత మెరుగు పర్చినట్లు హీరో కంపెనీ తెలిపింది. వేగం, పట్టు కోసం గేర్‌ వ్యవస్థలో మార్పులు చేశామని, వైబ్రేషన్స్‌ తగ్గించినట్లు వెల్లడించింది.

5 / 5
ఈ బైకు ట్రెయిల్‌బ్లూ, బ్లిట్జ్‌ బ్లూ, రెడ్‌ రైడ్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇంటిగ్రేడ్‌ స్టార్టర్‌, ఇంజిన్‌ కటాఫ్‌ స్విచ్‌, సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్‌, బ్లూటూత్‌ అనుసంధానించే ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, ఏబీఎస్‌ ఫీచర్లు ఉన్నాయి