
యూపీఐ ఐడీలు లేదా ఫోన్ నంబర్‌ల వంటి ప్రత్యేక ఐడెంటిఫైయర్‌లను ఉపయోగించి వినియోగదారులు డబ్బును బదిలీ చేయగల మొబైల్-ఫస్ట్ సిస్టమ్‌గా పనిచేస్తుంది. బిల్లు చెల్లింపులు, క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలు, థర్డ్-పార్టీ యాప్‌లతో అనుసంధానం చేయడంతో సహా కేవలం డబ్బు పంపడమే కాకుండా అనేక రకాల ఆర్థిక సేవలకు యూపీఐ మద్దతు ఇస్తుంది. ఐఎంపీఎస్ గ్రహీత ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వంటి వివరాలను ఉపయోగించి బ్యాంక్ ఖాతాల మధ్య డబ్బును బదిలీ చేయడానికి ప్రాథమికంగా రూపొందించారు.

ముఖ్యంగా యూపీఐ పీర్-టు-పీర్ లావాదేవీల కోసం సులభంగా ఉంటుంది. నగదు బదిలీకు ఖాతా నంబర్లు లేదా ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ల వంటి సంక్లిష్ట వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదు. డబ్బు బదిలీకు ఐఎంపీఎస్ మరింత అధికారికం, తరచుగా వివరణాత్మక సమాచారం అవసరం.

సాధారణంగా యూపీఐ ప్రతి లావాదేవీకి రోజువారీ లావాదేవీ పరిమితి రూ.లక్ష వరకు ఉంటుంది. అయితే ఐఎంపీఎస్ రోజువారీ లావాదేవీ పరిమితులు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. ఐఎంపీఎస్ ద్వారా రూ. 2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు బదిలీ చేయవచ్చు.

యూపీఐ ఐడీలన్నీ ప్లాట్‌ఫారమ్‌లు, బ్యాంక్‌లలో పని చేస్తాయి. అంటే వినియోగదారులు గ్రహీతకు సంబంధించిన బ్యాంక్ ఖాతా నంబర్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఐఎంపీఎస్ బదిలీలు నిర్దిష్ట బ్యాంక్ ఖాతాకు మాత్రమే చేస్తారు. అందువల్ల ఐఎంపీఎస్ ద్వారా నగదు బదిలీకు బ్యాంక్ వివరాలు అవసరం.

యూపీఐ లావాదేవీల్లో చాలా వరకు ఉచితంగా లేదా వ్యాపారులకు తక్కువ ఛార్జీలతో ఉంటాయి. అయితే ఐఎంపీఎస్ లావాదేవీలకు బ్యాంకు, లావాదేవీ మొత్తాన్ని బట్టి ఛార్జీలు సాధారణంగా తక్కువగా ఉండవచ్చు.

Upi Vs Imps