- Telugu News Photo Gallery Business photos Gold rates reached new heights amid middle east conflict, is it right time to buy gold
Gold Rates: మూడు నెలల గరిష్టానికి పసిడి.. ఈ సమయంలో బంగారం కొనడం మంచిదేనా?
పసిడి పరుగులు పెడుతోంది. పండుగల సీజన్లో ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఏకంగా మూడు నెలల గరిష్టానికి ఎగబాకింది. అక్టోబర్ 20 శుక్రవారం నాటికి 0.2శాతం పెరిగి ఔన్స్ బంగారం 1978 డాలర్లకు చేరింది. ఈ ఏడాది జూలై 20 తర్వాత ఇంత మొత్తంలో పెరగడం ఇదే తొలిసారి. భవిష్యత్తులో మరో 0.5శాతం పెరిగి 1989.90 డాలర్లకు చేరుతుందని పలు రిపోర్టులు అంచనా వేస్తున్నాయి. శనివారం 22 కేరట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 56,651గా ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 5 నాటికి మన దేశంలో పది గ్రాముల 22కేరట్ల బంగారం ధర రూ. 60,615 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంతలా పసిడి రేట్లు పెరగడానికి కారణం ఏమిటి? తెలుసుకుందాం రండి..
Updated on: Oct 21, 2023 | 4:00 PM

కారణాలు ఇవేనా.. పసిడి ధరల పెరుగుదలకు రెండు కీలక కారణాలు కనిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాలైనా ఇశ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం ఒక కారణమైతే.. మరొకటి ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపె ముగింపు దశకు చేరుకుంటుందన్న సెంటిమెంట్.

బంగారంపై పెట్టబడి సురక్షితం.. ఆర్థిక, రాజకీయ అనిశ్చితి సమయంలో బంగారాన్ని అందరూ సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. మన లాంటి దేశంలో బంగారం అంటే కేవలం అది విలువైన లోహం మాత్రమే కాదు సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుగా ఉంటుంది. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది.

యుద్ధ భయం.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తీవ్రమవుతున్నందున, అది విస్తృత ప్రాంతీయ సంక్షోభంగా పరిణామం చెందుతుందనే భయం అందిరిలోనూ. ఇది సుదీర్ఘమైన సంఘర్షణగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. పైగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ ఇటీవల హమాస్ ను కూకటి వేళ్లతో పెకిలించడానికి భూతల యుద్ధం కూడా చేస్తామని చెప్పడం ఈ భయాలకు మరింత ఊతం ఇస్తున్నాయి.

బంగారానికి డిమాండ్.. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలకు రెక్కలొస్తున్నాయి.

ఇది కూడా కారణమే.. ఫెడర్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్స్ చేసిన వ్యాఖ్యలు కూడా బంగారు రేట్ల పెరుగుదలకు కారణమయ్యాయి. ఆయనఏమన్నాడంటే రేట్ల పెంపు ఇప్పడు ఉండదని చెప్పారు. దీంతో చాలా మంది బంగారాన్ని తమ వద్దే అట్టిపెట్టేసుకున్నారు. దీంతో బంగారం మార్కెట్లోకి రావడం తగ్గిపోయి ఆటోమేటిక్ గా రేట్లు పెరిగాయి.

నిపుణుల సూచన.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున.. ఆర్థిక ఒడిదుడుకులు మార్కెట్లను అశాంతికి గురిచేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ఆకర్షణీయమైన, నమ్మదగిన పెట్టుబడి ఎంపికగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.




