AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: ఇండియాలో బంగారం కొనుగోలు చేస్తే ఎంత ట్యాక్స్ చెల్లించాలి..? ఐటీ రూల్స్ ఇవే..

భారత్‌లో బంగారం ఎక్కువమంది కొనుగోలు చేస్తుంటారు. పెళ్లి, పంక్షన్లు, పండుగల సమయాల్లో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఇండియాలో గోల్డ్ కొనుగోలుపై ట్యాక్స్ నిబంధనల గురించి చాలమందికి అవగాహన లేదు. బంగారం కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ వర్తిస్తుంది. ఈ నిబంధనల గురించి తెలుసుకుందాం.

Venkatrao Lella
|

Updated on: Oct 19, 2026 | 5:30 PM

Share
భారతీయులకు బంగారం అంటేనే ఒక సెంటిమెంట్. పండుగల సమయంలో బంగారం కొంటే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఒక ఆభరణంగానే కాకుండా ఒక ఆస్తిగా దీనిని భావిస్తారు. పండుగలు, పంక్షన్లు వస్తే చాలు బంగారు ఆభరణాలు ధరించి మురిసిపోతుంటారు. ఇండియాలో ప్రతీఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఎంతోకొంత బంగారం అనేది ఉంటుంది. ఆపద సమయంలో ఆర్ధిక అవసరాలను తీర్చడంలో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చాలామంది కొనుగోలు చేస్తుంటారు.

1 / 5
భారత్‌లో గోల్డ్‌ కొనుగోలుపై అనేక ట్యాక్స్ నిబంధనలు ఉన్నాయి. రూ.2 లక్షలకు మించి బంగారం కొంటే పాన్ అందించాల్సి ఉంటుంది. అధికంగా కొనుగోలు చేస్తే ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. దేశంలో బంగారు ఆభరణాల కొనుగోలుపై 3 శాతం జీఎస్టీ అమల్లో ఉంది.  ఇక మేకింగ్ ఛార్జీలపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. విదేశాల నుంచి భారత్‌కు ఎక్కువగా బంగారం, వెండి దిగుమతి అవుతూ ఉంటుంది.

2 / 5
బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాలు విధిస్తుంది. వీటినే దిగుమతి సుంకాలుగా పిలుస్తారు. బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని  6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ 2026 మే 13వ తేదీన కేంద్రం నిర్ణయం తీసుకుంది. 15 శాతంలో 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ది సెస్ 5 శాతంగా నిర్ణయించారు.

3 / 5
కేంద్రం విధించే దిగుమతి సుంకాలు బంగారం ధరలపై ప్రభావితం చూపిస్తాయి . అయితే దేశంలోని పౌరులు ఎంత బంగారమైనా కొనుగోలు చేయవచ్చు. దీనిపై ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. కానీ ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. జీఎస్టీ చెల్లించడంతో పాటు పత్రాలను భద్రపర్చుకోవాలి. దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు.

4 / 5
ఒక వ్యక్తి ఎంత అయినా బంగారం కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇంట్లో ఎంత బంగారమైన భద్రపర్చుకోవచ్చు. కానీ వాటికి సంబంధించిన ఆధారాలు భద్రపర్చుకోవాలి. దీని వల్ల ఐటీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది.

5 / 5
Follow Us