
Gold and Silver Prices: బడ్జెట్‌కు ముందు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు భారీ స్థాయిలో దిగి వస్తున్నాయి. గత రెండు రోజులుగా ఈ తగ్గింపులు మొదలయ్యాయి.

తాజాగా శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 8,620 రూపాయలు తగ్గుముఖం పట్టగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై ఏకంగా 7,900 తగ్గింది.

ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా భారీ స్థాయిలో తగ్గడం వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుంది. కిలో వెండిపై ఏకంగా 45 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. తగ్గిన తర్వాత కిలో సిల్వర్ ధర 3,50,000 వద్ద ట్రేడవుతోంది.

ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,580 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,47,200 వద్ద ఉంది. ధరలు తగ్గిన హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,60,580 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల ధర 1,47,200 వద్ద ట్రేడవుతోంది.

ప్రపంచ మార్కెట్‌లో డాలర్ విలువ పెరగడం, అలాగే మెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాల వల్ల పెట్టుబడిదారులు బంగారంపై కాకుండా ఇతర మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయికి చేరిన ధరల నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాలను స్వీకరించడం వల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాలపై తీసుకునే నిర్ణయాలు కూడా స్థానిక ధరలపై ప్రభావం చూపుతున్నాయి.