Union Budget 2026: నేరుగా రైతుల అకౌంట్లోకే యూరియా రాయితీ.. గిగ్ కార్మికులకు కనీస వేతనం.. ఆర్ధిక సర్వేలో కీలక అంశాలివే..

Updated on: Jan 29, 2026 | 5:11 PM

కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఆర్ధిక సర్వేను విడుదల చేశారు. పార్లమెంట్‌లో ఈ సర్వేను వెల్లడించారు. ఈ ఆర్ధిక సర్వేలో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. రైతులు, గిగ్ కార్మికులకు సంబంధించి పలు కీలక విషయాలు ఇందులో ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1 / 5
బడ్జెట్ ప్రకటనకు ముందు ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టడం అనేది అనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా 2025-26 ఆర్ధిక సర్వేను కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టారు. ప్రస్తుత దేశ ఆర్ధిక స్థితితో పాటు భవిష్యత్తులో ఎలా ఉంటుందనే విషయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. భౌగోళికంగా ఆర్ధిక సంక్షోభం నెలకొన్నప్పటికీ.. దేశ జీడీపీ వృద్ది బలంగా ఉందని ఆర్ధిక సర్వే సూచిస్తోంది. ఈ ఆర్ధిక సర్వేలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం.

2 / 5
2024-25 ఆర్ధిక సంవత్సరంలో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 357.73 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగిందని ఆర్ధిక సర్వేలో తేలింది. గత సంవత్సరం కంటే 254.3 మిలియన్ మెట్రిక్ టన్నులు పెరిగినట్లు తెలిపింది. ఇక పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటివరకు రైతులకు రూ.4.09 లక్షల కోట్లు అందించినట్లు తెలిపింది. ఇక యూరియా రిటైల్ ధరలు పెరిగినట్లు ఆర్ధిక సర్వే తేల్చింది.

3 / 5
యూరియా ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆర్ధిక సర్వే సూచించింది. ఇక వ్యవసాయ ఎగుమతి విధానంలో తరచుగా జరుగుతున్న మార్పులు భారతదేశ ఎగుమతి రంగానికి సవాల్‌ను విసురుతున్నాయని సర్వే తెలిపింది.  దేశీయంగా ధరలు, ఉత్పత్తిలో హెచ్చుతగ్గుల వల్ల ప్రభుత్వం ఎగుమతులపై నిషేధాలు, కనీస ఎగుమతి ధరలు విధించేలా చేస్తుందని స్పష్టం చేసింది.

4 / 5
కేంద్రం తీసుకునే నిర్ణయాల సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తాయని ఆర్ధిక సర్వేలో తేలింది.  దీని వల్ల విదేశీ కొనుగోలుదారులు ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతారని తెలిపింది. ఇక గిగ్ కార్మికులకు కనీస వేతనం అందించాలని సర్వే సూచించింది. ఇండియాలో దాదాపు 40 శాతం మంది గిగ్ కార్మికులు రూ.15 వేల కంటే తక్కువ సంపాదిస్తున్నారు.

5 / 5
దీంతో గిగ్ కార్మికులకు గంటల వారీగా కనీస వేతనం లేదా పూర్తి స్థాయి వేతం కల్పించాలని ఆర్ధిక సర్వే సూచించింది. దీని వల్ల గిగ్, సాధారణ ఉద్యోగాల మధ్య జీతం అంతరాన్ని తగ్గించవచ్చని సూచించింది. ఇక జనవరి 2026 నాటికి 310 మిలియన్ల మంది కార్మికులు ఈ శ్రామ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నట్లు ఆర్ధిక సర్వే పర్కొంది