- Telugu News Photo Gallery Business photos Does PAN number mean so much, A special method of assigning a number, Pan Card number details in telugu
Pan Card: పాన్ నెంబర్‌లో ఇంత అర్థం ఉందా..? నెంబర్ కేటాయించడానికి ప్రత్యేక పద్ధతి
ప్రస్తుత రోజుల్లో బ్యాంకింగ్ అవసరాలకు పాన్ నెంబర్ అనేది తప్పనిసరిగా కావాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరి పాన్ కార్డులో ఆల్ఫా న్యూమెరిక్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఇంగ్లిష్ అక్షరాలతో పాటు నాలుగు నెంబర్లతో వస్తుంది. కానీ చాలా మంది పాన్ నెంబర్‌ను ఎలా కేటాయిస్తారనే విషయం తెలియదు. ఈ నంబర్ల ద్వారా మన సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ ట్రాక్ చేస్తుంది. ఈ నేపథ్యంలో పాన్ కార్డు నెంబర్‌ను ఎలా కేటాయిస్తారు? ఈ నెంబర్ అర్థం ఏంటి? వంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం.
Updated on: Oct 08, 2024 | 4:20 PM

సాధారణంగా ప్రతి ఒక్కరి పాన్ కార్డుపై ప్రతి ఒక్కరి పేరు, పుట్టిన తేదీ ఉంటుంది. అయితే పాన్ నెంబర్‌లో కూడా ఇంటి పేరు ఉంటుందని చాలా మందికి తెలియదు. పాన్ కార్డులోని ఐదో అంకె మీ ఇంటి పేరును సూచిస్తుంది.


పాన్ కార్డులోని మొదటి మూడు అక్షరాలు AAA నుంచి ZZZ వరకు ఉంటాయి. ఈ నెంబర్లు ప్రస్తుతం పాన్ నెంబర్ కేటాయించే సిరీస్‌లకు అనుగుణంగా ఉంటాయి.

పాన్ కార్డులోని నాలుగో డిజిట్ కూడా అక్షరమే. ఇది కార్డుదారుని స్థితిని తెలియజేస్తుంది. నాలుగో అక్షరానికి చాలా అర్థం ఉంటుంది. పి అని ఉంటే పరనల్ అని, ఎఫ్ అని ఉంటే ఫమ్, సి అంటే కంపెనీ, ఎ ఉంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అని, టి అంటే ట్రస్ట్, హెచ్ అంటే హిందూ అవిభాజ్య కుటుంబం, బి అంటే పర్సనల్ బాడి, ఎల్ అంటే లోకల్ బాడీ, జె అంటే ఆర్టిఫిషియల్ జ్యూడిషియల్ పర్సన్ అని, జి అంటే ప్రభుత్వం అని అర్థం

పాన్ కార్డులోని ఐదో అంకె ఆంగ్ల అక్షరం. ఇది మీ ఇంటి పేరులోని మొదటి అక్షరం. దీని తర్వాత పాన్ కార్డులోని నాలుగు నెంబర్లు ఉంటాయి. ఇది 0001 నుంచి 9999 వరకు ఎంతైనా ఉండవచ్చు. అయితే పాన్ కార్డులోని చివర అంకె కూడా ఆంగ్ల అక్షరం. ఈ నెంబర్ A నుంచి Z వరకు ఏదైనా ఉండవచ్చు.




