
ne 2Bumper Offers: ఈ-కామర్స్ కామర్స్ వేదికలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు అప్పుడప్పుడు భారీ డిస్కౌంట్లు అందిస్తూ ఉంటాయి. ఇక స్మార్ట్‌ఫోన్లు, ఏసీలపై ఆన్‌లైన్ డిస్కౌంట్లు వెల్లువ ఎక్కువపోతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో ఈ-కామర్స్ వేదికపై పలు రకాల ఆఫర్లు అందిస్తున్నాయి.

అయితే పండగ సీజన్‌కు ముందు స్టాక్స్‌ను తగ్గించుకునే దిశగా పలు బ్రాండ్లపై డిస్కౌంట్ ఆఫర్లు ఆయా కంపెనీలు ప్రకటిస్తున్నాయి. రవాణా, ఉత్పాదక వ్యాయాలు పెరిగినా స్మార్ట్‌ఫోన్లు, దుస్తులు, కిరాణ సరుకులు,ఏసీల అమ్మకాలు పెరిగేలా భారీ డిస్కౌంట్లు ఉంటాయని అంచనా ఉన్నాయి. కరోనా సెకండ్‌వేవ్‌తో అమ్మకాలు దెబ్బతినడంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీ సైతం డిస్కౌంట్ల బాటపడుతున్నాయి.

అయితే అమెజాన్, ప్లిఫ్‌కార్ట్, జియోమార్ట్ వంటి ఈ కామర్స్ దిగ్గజాలు బిస్కెట్లు, ఆటా, మసాలా దినుసులు, శీతల పానీయాలు, స్నాక్స్, నెయ్యి, తదితర వస్తువులపై ఈనెల నుంచి 60 శాతం వరకూ డిస్కౌంట్లు ప్రకటించాయి. ఇక ప్లిఫ్‌కార్ట్ కొన్ని వస్తువులను రూ 1కి కూడా విక్రయిస్తోంది.

కరోనా సెకండ్ వేవ్‌తో ఏప్రిల్, మే నెలల్లో లాక్‌డౌన్ ఫలితంగా పేరుకుపోయిన ఇన్వెంటరీని వదిలించుకునేందుకు డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇలా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తుండటంతో వినియోగదారులకు పండగలా మారిపోయింది.