
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో రైతులకు అనేక వరాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఈ బడ్జెట్‌లో మరెన్నో అంశాలు ఉండవచ్చు.


అలాగే కేంద్రం ప్రారంభించిన పథకం కింద ఇప్పటి వరకు 18 విడతల సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కాగా, 19వ విడత కోసం ఎదురుచూస్తున్నారు రైతులు.

అంతేకాకుండా కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని కూడా కేంద్రం పెంచవచ్చు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచవచ్చు. వ్యవసాయరంగం అభివృద్ధికి ప్రభుత్వం గత ఏడాది కంటే 15 శాతం అధికంగా రూ.1.75 లక్షల కోట్లు కేటాయించవచ్చని అంచనా.

దేశంలో వ్యవసాయోత్పత్తుల సరఫరాను పెంచడంతో పాటు ఎగుమతులపై ఎక్కువ ప్రాధాన్యతను బడ్జెట్ లో ఆలోచించవచ్చు. 2030 నాటికి కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను 50 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లకు పెంచవచ్చు.