
BMW Electric Car: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు వాహన సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాలు మార్కెట్లో విడుదల అవుతున్నాయి. ఇక ఎలక్ట్రిక్ కార్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇక తాజాగా జర్మనీకి చెందిన వాహన దిగ్గజం బీఎమ్‌డబ్ల్యూ (BMW) ఎలక్ట్రిక్ స్పోర్స్ట్ కారు ఎస్‌యూవీ ఐఎక్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. అయితే రాబోయే ఆరు నెలల్లో ఇండియాలో విడుదల చేయబోయే మూడు ఎలక్ర్టిక్ వాహనాల్లో ఇది మొదటిది.

ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.1.16 కోట్లు. బీఎండబ్ల్యూ డీలర్‌షిప్‌లలో, కంపెనీ వెబ్‌సైట్ నుంచి కూడా ఈ కారును బుక్ చేసుకోవచ్చని, బుక్ చేసుకున్న వారికి 2022 ఏప్రిల్ నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ వాహనం ఆల్ వీల్ డ్రైవ్ వాహనంగా వస్తోంది. ఇందులో రెండు విద్యుత్ మోటార్లు అమర్చారు. ఈ వాహణం 6.1 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంటుంది. అయితే ప్రారంభ ఆఫర్ ఇకంద స్మార్ట్ బీఎండబ్ల్యూ వాల్‌బాక్స్ ఛార్జర్‌ను ఉచితంగానే అందిస్తున్నారు.

రెండున్న గంటల ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. 150 కిలోవాట్స్ డీసీ ఛార్జర్‌తో 31 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 10 నిమిషాల్లో 95 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 50కిలోవాట్స్ డీసీ ఛార్జర్ ద్వారా 73 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇక భారత్‌లో 35 నగరాల్లో డీలర్ నెట్ వర్క్ వద్ద ఛార్జర్లను ఇన్‌స్టాల్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ కారుకు రెండు సంవత్సరాల పాటు వారెంట్ అందిస్తోంది కంపెనీ. అలాగే 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు బ్యాటరీలకు వారెంటో అంస్తోంది. ఇక బీఎండబ్ల్యూ నుంచి మరిన్ని కార్లు అందుబాటులోకి రానున్నారు. ఇప్పటికే ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులకు ఎలక్ట్రిక్ వాహనాలతో కొంత ఇబ్బందులు తప్పనున్నాయి. ద్విచక్ర వాహన రంగంలో చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాబాటులోకి రాగా, మరి కొన్ని వాహనాలు విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.