సురక్షితమేనా.. మన బంగారం తాకట్టు పెడుతున్నప్పుడు కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు అక్కడే బంగారం భద్రంగా ఉంచాల్సిన బాధ్యత బ్యాంకులకు ఉంటుంది. సరిగ్గా ఇదే విషయంలో బ్యాంకుల నుంచి కచ్చితమైన సమాచారాన్ని తీసుకోవాలి. బంగారాన్ని భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూం ఉందా? ఎదైనా ఊహించని ప్రమాదం, దోపిడీ, అగ్నిప్రమాదం, విద్రోహ చర్యల వంటివి జరిగితే మీ బంగారానికి బీమా వర్తిస్తుందా అనేది చూసుకోవాలి. ఆ బ్యాంకుకు సీసీ టీవీలు ఉన్నాయా లేదా కూడా సరిచూసుకోవాలి.