
Best Scooters: భారతదేశంలో ద్విచక్ర వాహనాల వినియోగం చాలా ఎక్కువ. దీంతోపాటు మార్కెట్ కూడా ఎక్కువే. పెట్రోల్ ఇంధనంతో పనిచేసే ఎన్నో కంపెనీల బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ.. కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు 30 వేల రూపాయల లోపు టూ వీలర్‌ను కొనుగోలు చేసే ప్రత్యేక పొదుపు మార్గాన్ని మేము మీకు చెప్పబోతున్నాము. ఈ బైక్‌లు వారంటీ, క్యాష్‌బ్యాక్ లాంటి ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

Vespa LX: వెస్పా LXలో 125 cc ఇంజన్‌ను ఇచ్చారు. ఇది పసుపు రంగులో కూడా వస్తుంది. Droom వెబ్‌సైట్‌లో చెప్పిన సమాచారం ప్రకారం.. Piaggio Vespa LX 125cc స్కూటర్ లీటర్ పెట్రోల్‌కు 40 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ 9bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఈ స్కూటర్‌లో 7 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. దీని ముందు, వెనుక 150 మి.మీ. డ్రమ్ బ్రేక్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

Hero Maestro: హీరో మ్యాస్ట్రో స్కూటర్ Cars24 అనే వెబ్‌సైట్‌లో కేవలం 30 వేల రూపాయలకే అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ 2016 సంవత్సరం స్కూటర్. ఈ స్కూటర్ 27 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇది ఢిల్లీలోని DL-09 RTOలో రిజిస్ట్రేషన్ అయిఉంది.

Honda Activa 125: హోండా యాక్టివా 125 స్కూటీ ఇక్కడ కేవలం 30 వేల రూపాయలకే లభిస్తుంది. ఈ వైట్ కలర్ స్కూటీ బైక్స్ 24లో అందుబాటులో ఉంది. ఇది 2015 మోడల్. అలాగే ఇదే మొదటి హానర్ స్కూటర్. ఈ వాహనం హర్యానాలోని HR-29 RTOలో రిజిస్ట్రేషన్ అయి ఉంది.

Mahindra Kine: మహీంద్రా స్కూటర్ కేవలం 14 వేల రూపాయలకే అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ తక్కువ బరువు కలిగి ఉంటుంది. బైక్స్ 24లో ఉన్న ఈ స్కూటర్ 2013 మోడల్. ఇది ఢిల్లీలోని DL-04 RTOలో రిజిస్ట్రేషన్ అయిఉంది.