- Telugu News Photo Gallery Business photos Automobile companies hope old car business must recover after corona crash
Corona Effect: కరోనా ఎఫెక్ట్‌తో భారీగా తగ్గిన కార్ల కొనుగోళ్లు.. పుంజుకోనున్న పాత కార్ల బిజినెస్
Corona Effect: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత పాత కార్ల బిజినెస్ తప్పకుండా పుంజుకుంటుందని కంపెనీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వైరస్ సోకుతుందనే భయంతో..
Updated on: May 24, 2021 | 2:07 PM

Corona Effect: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత పాత కార్ల బిజినెస్ తప్పకుండా పుంజుకుంటుందని కంపెనీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వైరస్ సోకుతుందనే భయంతో చాలా మంది బస్సుల్లో వెళ్లేందుకు భయపడుతున్నారని, సొంత కార్లలోనే వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. కొత్త కార్ల కొనడం సాధ్యం కాని వారు సెకండ్ హ్యాండ్ కార్లవైపు మొగ్గు చూపుతున్నారని డీలర్లు చెబుతున్నారు.

మారుతి, మహీంద్రా, టొయోటా పాత కార్ల వ్యాపారంపై పెద్దగా లేకపోయినప్పటికీ దీర్ఘకాలంలో సేల్స్ పుంజుకుంటున్నాయని భావిస్తున్నాయి. సెకండ్‌వేవ్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పాత కార్ల వ్యాపారం ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టం. పాతకార్లకు డిమాండ్ ఉన్నప్పటికీ, డిమాండ్‌కు తగినంత సరఫరా రాకపోవచ్చు అని మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెబుతున్నారు.

Second Hand Car




