Amazon Pay: దిగ్గజ ఈకామర్స్ కస్టమర్ల కోసం ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా అమెజాన్ కీలక ప్రకటన చేసింది.
తన అమెజాన్ పే సర్వీసులను 5 కోట్ల మంది ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. కస్టమర్లు అమెజాన్ యాప్ ద్వారా దాదాపు 2 కోట్ల లోకల్ షాపుల్లో యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు నిర్వహిస్తున్నారని తెలిపింది.
టైర్ 2, టైర్ 3 పట్టణాల్లోనే అమెజాన్ పే సర్వీసులను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. 5 కోట్ల మంది కస్టమర్ల మైలురాయిని చేరుకోవడంతో కంపెనీ కస్టమర్లకు రివార్డులు అందిస్తోంది. డైలీ రివార్డ్‌లను ఆఫర్ చేస్తోంది. సెప్టెంబర్ నెల మొత్తం ఈ ప్రయోజనం పొందవచ్చని తెలిపింది.
షాపింగ్, బిల్లుల చెల్లింపు, మనీ ట్రాన్స్‌ఫర్ వంటి వాటి కోసం అమెజాన్ పే వాడే వారికి ఆఫర్లు లభిస్తాయి. ఇకపోతే కస్టమర్లు అమెజాన్ పే ద్వారా ఫోన్ రీచార్జ్, డీటీహెచ్ రీచార్జ్, మనీ ట్రాన్స్‌ఫర్ వంటి సేవలు పొందవచ్చు.
ఇకపోతే అమెజాన్‌లో షాపింగ్ కూడా చేయవచ్చు. లక్షల మంది కస్టమర్లకు, మర్చంట్లకు మెరుగైన సేవలు అందించడంలో ముందుంటామని అమెజాన్ పే సీఈవో మహేంద్ర నేరుర్కర్ పేర్కొన్నారు.