
ఒకటిన్నర సంవత్సరాలకు పైగా డీఏ బకాయిల కోసం ఎదురుచూస్తున్న కోట్ల మంది కేంద్ర ఉద్యోగులకు ఈ రోజు సంతోషకరమైన రోజు అని చెప్పాలి. ఉద్యోగులతోపాటు పెన్షనర్లకు డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) పెంచే ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

ఈ రోజు జరిగిన CCEA సమావేశంలో DAకు సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకుంది. DAను 3 శాతం పెంచడానికి ఈ రోజు ఆమోద ముద్ర పడింది.

7వ వేతన ఒప్పందం సంఘం సిఫార్సులను కేంద్రం పరిగణలోకి తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లిస్తున్న కరువు భత్యం (డియర్‌నెస్ అలవెన్స్ డీఏ)ను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన డీఏను 2021 నుంచి అమలు చేయనున్నారు. కరోనా కల్లోలం కారణంగా 2020 జనవరి నుంచి డీఏ పెంపు పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.

2021 జులై నుంచి కొత్త డీఏను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై పడింది. దీంతో ప్రభుత్వం డీఏ పెంచేందుకు అంగీకరించింది.