KCR: తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్కు.. 70 వసంతాల వేడుకలు
తెలంగాణ ఉద్యమ రథసారధి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 1954 ఫిబ్రవరి 17వ తేదీన సిద్దిపేట మండలం చింతమడకలో జన్మించారు. సొంత జిల్లాలోనే బాల్యం, విద్యాభ్యాసం పూర్తిచేశారు. చిన్న తనంనుంచే సాహిత్యం, కళలు, భాష, రాజకీయాలపై ఆసక్తి కనబరిచేవారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో లిటరేచన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా రాజకీయ తొలి అడుగు వేశారు. ఎన్టీఆర్ అంటే వీరాభిమానం.