
గోధుమ రంగులో ఉండే బ్రౌన్ షుగర్ తయారీ కోసం తక్కువ ప్రాసెసింగ్ చేస్తారు. అదే తెల్ల చక్కెర తయారీకి మాత్రం సిరప్ ను పూర్తిగా తొలగించే విధానంలో శుద్దీకరణ ప్రక్రియ మొదలవుతుంది. అందువల్లే ఈ చక్కెరకు తెలుపు రంగు వస్తుంది. అలాగే వీటి రుచులలోనూ తేడా ఉంటుంది.

స్వీట్లు, కేకుల తయారీలో తెల్ల చక్కెరను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.. బ్రౌన్ షుగర్ రుచి వేరుగా ఉంటుంది. బ్రౌన్ షుగర్ కంటే వైట్ షుగర్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. తెల్లని చక్కెర బరువును పెంచుతుంది. అలాగే, తెల్లచక్కెర తయారీలో సల్ఫర్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు.

అయితే, బ్రౌన్ షుగర్‌లో అనేక పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్ఆనరు. విటమిన్ బి, ఐరన్, కాల్షియం పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. దీని తయారీలో ఎలాంటి రసాయనాలు ఉపయోగించరు. ఇది జీర్ణశక్తిని బలపరుస్తుంది.

బ్రౌన్ షుగర్ పీరియడ్స్ క్రాంప్‌లను తగ్గిస్తుంది. స్త్రీలు పీరియడ్స్ సమయంలో నీటిని మరిగించి అందులో ఒక చెంచా బ్రౌన్ షుగర్, అల్లం, టీ ఆకులు వేసి తాగడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కాళ్లు, చేతుల్లో తిమ్మిరితోపాటు నొప్పిని కూడా తగ్గిస్తుంది.

బ్రౌన్ షుగర్ బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తెల్ల చక్కెర కంటే చాలా తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. అంతేకాదు.. బ్రౌన్ షుగర్‌ను స్క్రబ్‌గా వాడితే చర్మం మృదువుగా మారుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో కూడా ఉపయోగపడుతుంది. చర్మం మీద ఉన్న మచ్చలను, మురికిని తొలగిస్తుంది.