
చాలా మందికి చేతి, కాళ్ల గోళ్లు విరిగిపోతుంటాయి. కొన్నిసార్లు అవి బలహీనంగా కూడా మారుతాయి. మీ గోళ్లు కూడా ఇలా తరచుగా విరిగిపోతుంటే లేదా బలహీనంగా మారితే ఇది దేనికి సంకేతమో ఇక్కడ తెలుసుకుందాం..

గోర్లు మీ ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలు చెప్పగలవు. ముఖ్యంగా గోళ్లు తరచుగా విరిగిపోవడానికి ప్రధాన కారణం విటమిన్ లోపం. చాలా మంది విటమిన్ లోపాలు శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేస్తాయని అనుకుంటారు. కానీ బలహీనమైన గోళ్లు కూడా అంతర్గత ఆరోగ్యానికి సంకేతం. బలహీనమైన గోళ్లకు ప్రధాన కారణం విటమిన్ బి12 లోపం కావచ్చు.

ఈ ముఖ్యమైన విటమిన్ మీ గోళ్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. గోళ్లు నిరంతరం విరిగిపోతుంటే మీ ఒంట్లో విటమిన్ బి12 స్థాయిలను తనిఖీ చేసుకోవాలి.

విటమిన్ బి12 లోపం వల్ల అలసట, బలహీనత, నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచుగా తలతిరగడం వంటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. మీకు విటమిన్ బి12 లోపం ఉంటే ఆహారంలో చికెన్, చేపలు, గుడ్లను చేర్చుకోవాలి. అలాగే పాలలో విటమిన్ బి12 మంచి మొత్తంలో ఉంటుంది. మూంగ్ పప్పు కూడా తినవచ్చు.

విటమిన్ బి12 లోపం ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. విటమిన్ బి12 మాత్రలతోపాటు ఆహార మార్పులు చేసుకోవాలి. అయితే ఇవన్నీ వైద్యుల సూచనల మేరకు మాత్రమే పాటించాలన్న విషయం మర్చిపోకూడదు.