
భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం ఘనంగా జరిగింది.. బెంగళూరు దక్షిణ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపి తేజస్వి సూర్య, ప్రముఖ గాయని శివశ్రీ స్కందప్రసాద్‌ను వివాహమాడారు.. వీరి వివాహం గురువారం కనకపుర రోడ్డులోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది.

ఈ వివాహ వేడుకకు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర, కేంద్ర మంత్రులు వీ సోమన్న, అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా పలువురు బీజేపీ నాయకులు వివాహ వేడుకకు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

శివశ్రీ స్కందప్రసాద్, తేజస్వి సూర్య సాంప్రదాయ దుస్తులలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. 34 ఏళ్ల తేజస్వి సూర్య.. దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందారు.. సూర్య.. వృత్తి రీత్యా లాయర్.. 2019, 2024 ఎంపీ ఎన్నికల్లో గెలుపొందారు. కాగా.. 2020 నుంచి భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా తేజస్వి సూర్య కొనసాగుతున్నారు.

చెన్నైకి చెందిన శివశ్రీ స్కందప్రసాద్.. ప్రసిద్ధ కర్ణాటక సంగీత గాయని, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొందారు.. శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1 ఆగస్టు 1996న జన్మించిన ఆమె, మృదంగ కళాకారుడు సిర్కాలి శ్రీ జె స్కందప్రసాద్ కుమార్తె.

మార్చి 9న బెంగళూరులోని గాయత్రి విహార్ గ్రౌండ్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరుగుతుందని తేజస్వి సూర్య కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, మాజీ ఎంపీ ప్రతాప్ సింహా సహా అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.