
ఆహారం - పానీయాలపై శ్రద్ధ : వర్షాకాలంలో ఎల్లప్పుడూ తాజా, వేడి ఆహారాన్ని మాత్రమే తినాలి. వీధిలో లభించే పానీపూరి, సమోసా, కట్ చేసిన పండ్లు వంటి వాటికి దూరంగా ఉండాలి. అవి కడుపులో ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. అదేవిధంగా కాచి చల్లార్చిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలి.

పరిశుభ్రతను పాటించండి: మీ ఇంటి చుట్టుపక్కల నీరు నిలవకుండా చూసుకోండి. ఇది దోమలు వృద్ధి చెందకుండా నివారిస్తుంది. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలు లేదా రిపెల్లెంట్స్‌ను ఉపయోగించండి. అలాగే తడి బట్టలు, షూస్‌ను ఎక్కువసేపు ధరించడం మానుకోండి. తేమ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

రోగనిరోధక శక్తి బలోపేతం: జామ, బొప్పాయి, బేరి, నిమ్మకాయ వంటి విటమిన్ సి అధికంగా ఉండే కాలానుగుణ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోండి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అల్లం, పసుపు, తులసి వంటి వాటితో చేసిన టీ తాగడం కూడా ఈ సీజన్‌లో ఆరోగ్యానికి చాలా మంచిది.

తడిసిపోకుండా జాగ్రత్తపడండి: వర్షంలో తడిస్తే వెంటనే బట్టలు మార్చుకోండి. తడి బట్టలతో ఎక్కువసేపు ఉండటం వల్ల జలుబు, జ్వరం, చర్మ సమస్యలు వస్తాయి. ఎక్కడికి వెళ్లినా గొడుగు లేదా రెయిన్‌కోట్‌ను వెంట ఉంచుకోండి.

వ్యాయామం చేయండి: వర్షాకాలంలో వ్యాయామం చేయడం మానుకోకండి. తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల శరీరం చురుగ్గా ఉండి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు వర్షాకాలాన్ని ఆనందంగా గడపవచ్చు. మరియు వ్యాధుల బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.