Skin Care Tips: ముఖంపై ముడతలను పోగొట్టే ఫూల్ మఖానా!

| Edited By: Ravi Kiran

Dec 14, 2023 | 10:33 AM

వయసు వస్తున్న కొద్దీ.. శరీరంలో అనేక మార్పులు చేర్పులు జరుగుతూంటాయి. అదే విధంగా చర్మంపై కూడా పలు రకాల మార్పులు వస్తూంటాయి. ఈ క్రమంలో స్కిన్ పై ముడతలు అనేవి తప్పని సరిగా రావడం సాధారణమైన విషయం. కొంత మందికి ఎంత వయసు వచ్చినా ముఖంపై ఎలాంటి మచ్చలు, ముడతలు లేకుండా కాంతివంతంగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం వారు తీసుకునే ఆహారమే. పౌష్టిక ఆహారం తీసుకునే వారు.. ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. వీరికి వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. ఇలా చర్మ సమస్యల్ని దూరం చేయడంలో..

1 / 5
వయసు వస్తున్న కొద్దీ.. శరీరంలో అనేక మార్పులు చేర్పులు జరుగుతూంటాయి. అదే విధంగా చర్మంపై కూడా పలు రకాల మార్పులు వస్తూంటాయి. ఈ క్రమంలో స్కిన్ పై ముడతలు అనేవి తప్పని సరిగా రావడం సాధారణమైన విషయం. కొంత మందికి ఎంత వయసు వచ్చినా ముఖంపై ఎలాంటి మచ్చలు, ముడతలు లేకుండా కాంతివంతంగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం వారు తీసుకునే ఆహారమే.

2 / 5
పౌష్టిక ఆహారం తీసుకునే వారు.. ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. వీరికి వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. ఇలా చర్మ సమస్యల్ని దూరం చేయడంలో ఫూల్ మఖానా కూడా ఒకటి. మఖానాతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఇవి తింటే.. ఆరోగ్యంతో పాటు అందం కూడా మీ సొంతం అవుతుంది. తామర గింజలను వేపితే పేలాల మాదిరిగా ఫూల్ మఖానా సిద్ధమవుతుంది.

3 / 5
ఫూల్ మఖానా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మఖానాలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ముఖంపై నల్లటి మచ్చలను తగ్గించి, కాంతి వంతంగా తయారు చేస్తుంది. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను కూడా తొలగిస్తుంది.

4 / 5
చర్మాన్ని బిగుతుగా, మెరిసేలా చేయడంలో ఫూల్ మఖానా ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీంతో ముఖంపై ముడతలు తగ్గి.. కాంతి వంతంగా తయారవుతుంది. మఖానా తినడం వల్ల ఆందోళన, ఒత్తిడి, నిద్ర లేమి సమస్యలు కూడా దూరం అవుతాయి.

5 / 5
ఫూల్ మఖానాను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కూడా పెరగవు. వీటిని తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. చర్మాన్ని యంగ్ గా కనిపించేలా చేసే గ్లూటామైన్, అర్జినిన్, మెథియోనిన్ వంటి వృద్ధాప్య నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని వేయించుకుని తిన్నా, ఉడక బెట్టి తిన్నా మంచి ప్రయోజనాలు ఉంటాయి.