
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అలసట పెరుగుతుంది. దురద, చాలా పొడి వంటి చర్మ లక్షణాలు కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా, అధిక రక్తపోటు కూడా ఉంటుంది. కళ్లపై పసుపు రంగు మచ్చలు కనిపిస్తే అది అధిక కొలెస్ట్రాల్ లక్షణంగా అనుమానించాలి. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తనిఖీ చేయడానికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష రెగ్యులర్‌గా చేయించుకోవాలి. ఇది రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL), తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) మొత్తాన్ని తనిఖీ చేసే రక్త పరీక్ష.

కేవలం ఉడకబెట్టిన ఆహారం మాత్రమే ప్రతిరోజూ తినకూడదు. కొద్దిగా నూనె కూడా వాడాలి. కానీ కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వంటలో నాణ్యతలేని నూనె వాడితే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే ఇలాంటి నూనెలు వాడారంటే ఆరోగ్యం పూర్తిగా బాగుంటుంది. ముఖ్యంగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ నూనెలో ఇతర నూనెల కంటే మోనో-అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఈ నూనె కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే రోజువారీ వంటలలో ఆలివ్ నూనెను ఉపయోగించాలి.

అవిసె గింజల నూనెలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, ఒక రకమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. అవిసె గింజల నూనె శరీరంలో మంటను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

సోయాబీన్ నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. నువ్వుల నూనెలో బహుళఅసంతృప్త, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. నువ్వుల నూనె కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మీరు వంటలో పొద్దుతిరుగుడు నూనెను కూడా ఉపయోగించవచ్చు. సన్‌ఫ్లవర్ ఆయిల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. పొద్దుతిరుగుడు నూనెలో బహుళ అసంతృప్త, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.