Monsoon Season: వర్షాకాలంలో ఈ 5 రకాల టీలు ట్రై చేయండి.. ఆనందం రెట్టింపు అవుతుంది

Updated on: Jun 23, 2025 | 9:16 PM

భారతదేశంలో కూడా టీ ప్రియులకు కొరత లేదు. రోజుని టీతో మొదలు పెట్టేవారు చాలా మంది ఉన్నారు. మండే వేడిలో కూడా ప్రజలు వేడి టీ తాగడానికి ఇష్టపడతారు. వర్షాకాలంలో టీ తాగడం వల్ల ఆనందం పొందేవారున్నారు. అందుకే వీధి వీధిలో టీ స్టాల్స్ ఉన్నాయి. రకరకాల టీలు టీ ప్రియులను అలరిస్తున్నాయి. అయితే వర్షాకాలంలో ఆహ్లాదాన్ని ఇచ్చే 5 రకాల టీల గురించి తెలుసుకుందాం.

1 / 7
భారతదేశంలో ప్రతి వీధి మూలల్లో దుకాణాలలో టీ ప్రియులను కనుగొంటారు. 40 డిగ్రీల వేడిలో కూడా.. ప్రజలు టీ తాగుతూ కనిపిస్తారు. చాలా మందికి ఉదయం నిద్రలేవగానే... బద్దకాన్ని వదిలించుకోవడానికి ఒక కప్పు వేడి టీ అవసరం అని భావిస్తారు. ఏదైనా అంశం గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్నా టీ కావాల్సిందే.. స్నేహితులతో ప్రశాంతంగా ఉండాలనుకున్నా టీ కావాల్సిందే,  బాధను లేదా సమస్యను ఎవరితోనైనా పంచుకోవాలనుకున్నా.. సంతోషంగా ఉన్నప్పుడు అన్నిటికీ టీ కావాల్సిందే.. ఏ సందర్భంలోనైనా సిప్ టీ తాగితే మనసు ఉల్లాసంగా మారుతుంది. టీ తాగడానికి వర్షాకాలం ఉత్తమం. వర్షం పడుతూ వేడి టీ దొరికితే, వాతావరణం మరింత ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.

2 / 7
భారతదేశంలో ప్రతి రాష్ట్రం, నగరం, పట్టణంలో కొన్ని ప్రత్యేకమైన రుచి కలిగిన ఆహార పదార్ధాలు ఉన్నాయి. అదేవిధంగా వివిధ రుచులతో కూడిన టీలు కూడా ఇక్కడ ప్రాచుర్యం పొందాయి. వర్షాకాలంలో ఆనందాన్ని రెట్టింపు చేసే 5 విభిన్నమైన రుచికరమైన టీల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం..

3 / 7
మసాలా టీ
వర్షాకాలంలో వివిధ రకాల ఫ్లేవర్ టీల గురించి మాట్లాడుకుంటే.. ప్రజలు మసాలా టీ తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దీని రుచి చాలా బలంగా ఉంటుంది. ఈ టీని తాగిన వెంటనే ఉత్సాహంగా ఉంటుంది. రోడ్డు పక్కన ఉన్న స్టాల్‌లో దీన్ని తాగడం సరదాగా ఉంటుంది. అయితే మీరు ఇంట్లోనే మసాలా తయారు చేసుకుని వర్షంలో మసాలా టీని తాగుతూ ఆస్వాదించవచ్చు.

మసాలా టీ వర్షాకాలంలో వివిధ రకాల ఫ్లేవర్ టీల గురించి మాట్లాడుకుంటే.. ప్రజలు మసాలా టీ తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దీని రుచి చాలా బలంగా ఉంటుంది. ఈ టీని తాగిన వెంటనే ఉత్సాహంగా ఉంటుంది. రోడ్డు పక్కన ఉన్న స్టాల్‌లో దీన్ని తాగడం సరదాగా ఉంటుంది. అయితే మీరు ఇంట్లోనే మసాలా తయారు చేసుకుని వర్షంలో మసాలా టీని తాగుతూ ఆస్వాదించవచ్చు.

4 / 7
ఇరానీ టీ
ఇరానీ చాయ్ హైదరాబాదులో చాలా ప్రసిద్ధి చెందిన ఒక రకమైన పాలు కలిపిన టీ. ఈ ఛాయ్ సాధారణ టీ కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే టీ, పాలు రెండిటినీ వేరుగా వేడి చేసి ఆ తర్వాత వీటిని కలుపుతారు. ఇలా చేయడం వలన క్రీమీ, మందపాటి రుచి వస్తుంది. ఈ టీని ఇరానీ పావ్ లేదా బిస్కెట్లతో వడ్డిస్తారు.

ఇరానీ టీ ఇరానీ చాయ్ హైదరాబాదులో చాలా ప్రసిద్ధి చెందిన ఒక రకమైన పాలు కలిపిన టీ. ఈ ఛాయ్ సాధారణ టీ కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే టీ, పాలు రెండిటినీ వేరుగా వేడి చేసి ఆ తర్వాత వీటిని కలుపుతారు. ఇలా చేయడం వలన క్రీమీ, మందపాటి రుచి వస్తుంది. ఈ టీని ఇరానీ పావ్ లేదా బిస్కెట్లతో వడ్డిస్తారు.

5 / 7

తందూరి టీ
మసాలా చాయ్ తర్వాత... ఎక్కువ మంది ఇష్టపడేది తందూరీ చాయ్. ఈ టీ తీపి, సుగంధ రుచి కలయికతో మనసును సంతృప్తిపరుస్తుంది. ప్రతి ఒక్కరూ తందూరి టీని తాగడానికి ఇష్టపడతారు. అయితే తందూరీ చాయ్‌ను మట్టి కుండలలో తయారు చేస్తారు. టీ తయారు చేసిన తర్వాత దీనిని అధిక మంట మీద ఉడికించిన కుండలలో పోస్తారు. అప్పుడు ఈ టీకి భిన్నమైన వాసన, రుచిని ఇస్తుంది.

తందూరి టీ మసాలా చాయ్ తర్వాత... ఎక్కువ మంది ఇష్టపడేది తందూరీ చాయ్. ఈ టీ తీపి, సుగంధ రుచి కలయికతో మనసును సంతృప్తిపరుస్తుంది. ప్రతి ఒక్కరూ తందూరి టీని తాగడానికి ఇష్టపడతారు. అయితే తందూరీ చాయ్‌ను మట్టి కుండలలో తయారు చేస్తారు. టీ తయారు చేసిన తర్వాత దీనిని అధిక మంట మీద ఉడికించిన కుండలలో పోస్తారు. అప్పుడు ఈ టీకి భిన్నమైన వాసన, రుచిని ఇస్తుంది.

6 / 7
కాశ్మీరీ కహ్వా టీ
కాశ్మీర్ లోని కహ్వా టీని విదేశీ పర్యాటకులు కూడా ఇష్టపడతారు. ఇది రుచికరంగా ఉండటమే కాదు ఆరోగ్యకరమైనది కూడా. దీనిని కుంకుమపువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, బాదం, వాల్‌నట్స్ వంటి ద్రవ్యాలతో తయారు చేస్తారు. ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ సుగంధ టీని ఒకసారైనా ప్రయత్నించండి.

కాశ్మీరీ కహ్వా టీ కాశ్మీర్ లోని కహ్వా టీని విదేశీ పర్యాటకులు కూడా ఇష్టపడతారు. ఇది రుచికరంగా ఉండటమే కాదు ఆరోగ్యకరమైనది కూడా. దీనిని కుంకుమపువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, బాదం, వాల్‌నట్స్ వంటి ద్రవ్యాలతో తయారు చేస్తారు. ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ సుగంధ టీని ఒకసారైనా ప్రయత్నించండి.

7 / 7
కాశ్మీరీ నూన్ చాయ్
కహ్వా టీతో పాటు నూన్ చాయ్ కూడా కాశ్మీర్‌లో చాలా ప్రాచుర్యం పొందింది. దీనినే షీర్ చాయ్, గులాబీ చాయ్, లేదా కాశ్మీరీ టీ అని కూడా అంటారు. ఇది ఇతర టీల కంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది. దీన్ని చూసినప్పుడు ఎవరో మీ ముందు షేక్ చేసి ఉంచినట్లు అనిపిస్తుంది. నిజానికి ఈ టీ గులాబీ రంగులో ఉంటుంది. దీని రుచి కూడా సాధారణ టీ కంటే చాలా భిన్నంగా ఉంటుంది.

కాశ్మీరీ నూన్ చాయ్ కహ్వా టీతో పాటు నూన్ చాయ్ కూడా కాశ్మీర్‌లో చాలా ప్రాచుర్యం పొందింది. దీనినే షీర్ చాయ్, గులాబీ చాయ్, లేదా కాశ్మీరీ టీ అని కూడా అంటారు. ఇది ఇతర టీల కంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది. దీన్ని చూసినప్పుడు ఎవరో మీ ముందు షేక్ చేసి ఉంచినట్లు అనిపిస్తుంది. నిజానికి ఈ టీ గులాబీ రంగులో ఉంటుంది. దీని రుచి కూడా సాధారణ టీ కంటే చాలా భిన్నంగా ఉంటుంది.