Triphala Tea: త్రిఫల టీ తాగితే ఇన్ని లాభాలా? రోజుకొక్క కప్పుతాగినా చాలు.. ఎలా తయారు చేయాలంటే

|

Jul 18, 2024 | 12:44 PM

ఉదయాన్నే కప్పు టీ తాగందే చాలా మందికి తెల్లారదు. నిద్ర లేవగానే వేడిగా కప్పు మిల్క్ టీ లేదా గ్రీన్ టీ సిప్ చేయకపోతే రోజంతా ఏదో వెలితిగా ఉంటుంది. అయితే బలమైన రోగనిరోధక వ్యవస్థను పెంపొందించుకోవాలంటే మిల్క్‌ టీకి బదులు త్రిఫల టీ తాగాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు అన్ని వ్యాధులను దూరంగా ఉంచుతుంది. త్రిఫల టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి నిజంగానే పెరుగుతుందా అనే సందేహం..

1 / 5
ఉదయాన్నే కప్పు టీ తాగందే చాలా మందికి తెల్లారదు. నిద్ర లేవగానే వేడిగా కప్పు మిల్క్ టీ లేదా గ్రీన్ టీ సిప్ చేయకపోతే రోజంతా ఏదో వెలితిగా ఉంటుంది. అయితే  బలమైన రోగనిరోధక వ్యవస్థను పెంపొందించుకోవాలంటే మిల్క్‌ టీకి బదులు త్రిఫల టీ తాగాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు అన్ని వ్యాధులను దూరంగా ఉంచుతుంది. త్రిఫల టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి నిజంగానే పెరుగుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిజానికి.. త్రిఫల టీలో  యాంటీ ఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉంటాయి. డిటాక్సిఫైయింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో సహా ఎన్నో పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.

2 / 5
త్రిఫల అంటే ఉసిరి, కరక్కాయ, తానికాయల అనే మూడు పండ్ల మిశ్రమం. ఇది ఆయుర్వేద గ్రంథాలలో కూడా ఒక ముఖ్యమైన అంశం. ఈ త్రిఫల టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు నిలయం. ఇది ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఇది సహాయపడుతుంది.

3 / 5
ఇందులోని నిర్విషీకరణ లక్షణాలు మొత్తం ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కరక్కాయ, తానికాయలలో కూడా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

4 / 5
త్రిఫల శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. త్రిఫల.. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. బలమైన రోగనిరోధక ప్రతిస్పందన కోసం కీలకం. త్రిఫల టీ ఎలా తయారు చేయాలంటే..

5 / 5
త్రిఫల టీ సిద్ధం చేయడానికి కొన్ని దశలను అనుసరించాలి.. త్రిఫల పొడి 1 టీస్పూన్, 1 కప్పు నీరు, రుచికి తగినంత తేనె లేదా నిమ్మకాయ అవసరం. ఎలా చేయాలంటే.. ముందుగా ఒక కప్పు నీళ్లు తీసుకుని మీడియం వేడి మీద మరిగించాలి. నీరు మరిగిన తర్వాత త్రిఫల పొడిని వేడినీటిలో కలపాలి. తర్వాత సుమారు 10 నుండి 15 నిమిషాలు మూతపెట్టి అలాగే ఉంచాలి. అప్పుడు త్రిఫల పౌడర్ సమ్మేళనాలు నీటిలో కరిగిపోతాయి. ఇప్పుడు టీని వడకట్టి కప్పులో పోసి.. రుచికోసం అందులో తేనె లేదంటే నిమ్మరసం కలుపుకుంటే సరిపోతుంది.