Lemon water: భోజనం చేసిన తర్వాత ఒక చెంచా నిమ్మరసం తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?

|

Oct 15, 2024 | 7:29 AM

బరువు తగ్గాలనే కోరికతో ప్రస్తుతం చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో లెమన్ వాటర్ తాగుతున్నారు. అయితే, లెమన్‌ వాటర్‌ కేవలం ఖాళీకడుపుతోనే కాదు.. భోజనం తరువాత కూడా తొచ్చునని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. లెమన్‌ వాటర్‌ కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత నిమ్మకాయ నీళ్లు తాగటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు నిమ్మరసం తాగడం ద్వారా మీ శ్వాసను తాజాగా ఉంచుతుంది. నిమ్మకాయ నీరు నోరు పొడిబారకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే, నిమ్మకాయల్లోని సిట్రిక్ యాసిడ్ కాల్షియం కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది. నిమ్మకాయలలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి, అలాగే మెదడు, నరాల పనితీరుకు మంచిది. ఇది మీ కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను తొలగిస్తుంది.

2 / 5
బరువు తగ్గాలని చాలా మంది ఉదయాన్నే పరగడుపున లెమన్ వాటర్ తాగుతుంటారు. కానీ, మీరు భోజనం చేసిన తర్వాత కూడా లెమన్ వాటర్ తాగొచ్చునని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తిన్న వెంటనే నిమ్మరసం తాగటం వల్ల మీ జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఇది మీ జీర్ణక్రియ వేగాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో మీకు జీర్ణ రసాలు, ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల మీకు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

3 / 5
నిమ్మకాయలు సిట్రస్ పండ్లు. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రకరకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. ఇది శరీర pH స్థాయిని సమతుల్యం చేయడానికి బాగా సహాయపడుతుంది. తిన్న తర్వాత లెమన్ వాటర్ ను తాగితే గ్యాస్ట్రిక్ యాసిడ్ సమస్యను తగ్గిస్తుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్ ఉత్పత్తిని  కూడా పెంచుతుంది. తిన్న తర్వాత లెమన్ వాటర్ తాగితే చర్మం అందంగా మెరిసిపోతుంది.

4 / 5
నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఆక్సీకరణ నష్టం లేదా ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. నిమ్మకాయ ఆమ్లంగా ఉన్నప్పటికీ.. ఇది గ్యాస్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. నిమ్మకాయ వాటర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ రిఫ్లక్స్ వ్యాధి నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది.

5 / 5
లెమన్ వాటర్ ఒక గొప్ప డిటాక్స్ డ్రింక్. ఇది మన శరీరం నుంచి టాక్సిన్స్, హానికరమైన కణాలను బయటకు పంపడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే ఇది  రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది. రోజూ భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలుపుకుని తాగితే .. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.