తొక్కే కదా అనుకుంటే తప్పే..! ఖరీదైన ఈ పండ్ల తొక్కలు కూడా ఎన్నో రోగాలను దూరం చేస్తాయి..!

|

Nov 19, 2023 | 1:58 PM

పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటారు. క్రమం తప్పకుండా మనం తినే ఆహారంలో పండ్లను చేర్చుకోవటం వల్ల ఎన్నో రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే, దాదాపుగా మనందరం పండ్లను తింటాం కానీ, వాటి తొక్కలను తీసి పడవేస్తుంటా..కానీ, అలా చేయటం తప్పంటున్నారు పోషకాహార నిపుణులు. నిజానికి కొన్ని రకాల పండ్ల తొక్కలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
కివి పండు.. కాస్త ఖరీదైనదే.. కానీ, దీని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం పుష్కలం.. ముఖ్యంగా కివి పండును డెంగ్యూ బాధితుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి తప్పక తీసుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. కానీ, కివి పండు తొక్క.. గరుకుగా, దృఢంగా ఉంటుంది. అందుకే ఎవరూ తినేందుకు ఇష్టపడరు.. కానీ, కివి పండు తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ C పొందవచ్చు. నిజానికి, దాని పైతొక్క.. గుజ్జు కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.

2 / 5
డ్రాగన్ ఫ్రూట్ ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన డ్రాగన్‌ ఫ్రూట్‌ను మనం తొక్కను తీసేసే తింటాం... కానీ, డ్రాగన్‌ ఫ్రూట్‌ తొక్క కూడా చాలా ఆరోగ్యకరమైనదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ తొక్కలో ఎక్కువ మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, బీటాసైనిన్ లు ఉన్నాయి. ఇందులో మంచి మొత్తంలో ఆంథోసైనిన్లను కూడా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతాయి. డ్రాగన్‌ ఫ్రూట్‌ తొక్కలో ఉండే డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది.

3 / 5
ఈ పండును తింటుంటే..ఆపిల్ పండు తింటున్న అనుభూతి కలుగుతుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. కొలెస్ట్రాల్, మలబద్ధకం, మధుమేహం అలాగే క్యాన్సర్‌ను కూడా దూరంగా ఉంచుతుంది. పియర్‌ పండు తొక్కలో ఎన్నో పోషకాలు, ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ లు ఉంటాయి. ఇది ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  పియర్ పండు పీల్స్‌లో ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది మిమ్మల్ని అతిగా తినకుండా చేస్తుంది.

4 / 5
ఆపిల్‌ పీల్స్‌లో అధిక మొత్తంలో ఉర్సోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొవ్వును తొలగిస్తుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి మంచిది. ఆపిల్‌ పీల్స్‌లో ఉండే క్వెర్సెటిన్ అనే మూలకం శ్వాస సమస్యలను తొలగిపోతాయి. మొత్తం ఆపిల్‌లో 8.5 మిల్లీగ్రాముల విటమిన్ సి,  98 యూనిట్ల విటమిన్ ఎ ఉంటుంది. పై తొక్కను తొలగించడం వల్ల 8.5 మిల్లీగ్రాముల నుంచి 6.5 వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

5 / 5
జామకాయను.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే చవకైన పండు.. దీన్ని సాధారణంగా తొక్కతోనే తింటుంటారు. జామపండు తొక్కతో కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది మన చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది..అంతేకాదు. చర్మం, జుట్టుకు ఎన్నో పోషకాలను అందిస్తుంది. జామ తొక్క సారం మన చర్మాన్ని అందంగా, ప్రకాశవంతంగా చేస్తుంది. అలాగే చర్మంపై మచ్చలను పోగొడుతుంది. మొటిమలను కూడా నివారిస్తుంది.