Cinnamon Water Benefits: రోజూ పరగడుపున దాల్చిన చెక్క నీళ్లు తాగితే.. ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం..!

Updated on: Feb 05, 2025 | 7:43 AM

ప్రతి వంటింట్లో అందరికీ అందుబాటులో ఉండే దాల్చిన చెక్కతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..? ఇది ఆహారం రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తుంది. అయితే దాల్చిన చెక్క పొడి రూపంలోనే కాదు.. నీళ్లలో మరిగించి తాగడం వల్ల కూడా అంతే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. అందుకే ఆయుర్వేద ఔషదాల్లో తప్పనిసరిగా వాడుతుంటారు. ఆయా లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీనికోసం పోషకమైన వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో దాల్చిన చెక్క కూడా ఒకటి. దాల్చిన చెక్కలో తగినంత మొత్తంలో కాల్షియం, ఫైబర్, యాంటీవైరల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

2 / 5
 దాల్చిన చెక్కను వివిధ రూపాల్లో తీసుకుంటే దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయి. దంతాల నొప్పిని తగ్గించడంలో, నోటి బ్యాక్టీరియా పెరుగుదలను అదుపు చేయడంలో దాల్చినచెక్క సాయపడుతుంది. దాల్చిన చెక్క తీసుకుంటే దుర్వాసన తగ్గుతుంది. దాల్చిన చెక్కను తింటే మలబద్దకం, అజీర్తి తగ్గుతాయి.

3 / 5
దాల్చిన చెక్క నీటిలో యాంటీఆక్సిడెంట్, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అంటు వ్యాధులు, వ్యాధుల నుండి మీ శరీరాన్ని కాపాడుతుంది. దాల్చిన చెక్క నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు రాకుండా నియంత్రించవచ్చు. దీన్ని తాగడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉండదు.

4 / 5
దాల్చిన చెక్క గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా దాల్చినచెక్క తీసుకోవడం వల్ల ట్రై గ్లిజరాయిడ్స్‌ తగ్గుతాయి. దాల్చిన చెక్కలో ప్రీబయోటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడతాయి.

5 / 5
దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. ఇది కేలరీలు బర్న్ అవ్వడానికి, బరువు తగ్గడానికి దారితీస్తుంది. అంతేకాదు, దాల్చిన చెక్క మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది అభిజ్ఞా పనితీరు, జ్ఞాపకశక్తి, శ్రద్ధను మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదాన్ని దరి చేరకుండా చేస్తుంది.