
కరివేపాకు: పప్పు, సాంబారు వంటి అన్ని వంటకాల్లో కరివేపాకు వాడతారు. కరివేపాకు ఆకులలో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, పీచు పోషకాలతోపాటు విటమిన్-సి, విటమిన్-బి, విటమిన్-ఇలు అధికం. రోజూ దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు పొందుతారు. మధుమేహులకు ఇది సరైన ఆహారం. నాడీసంబంధిత వ్యాధుల్నీ, క్యాన్సర్లనీ అడ్డుకుంటుందట. ఇందులో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

కరివేపాకు నమలడం వల్ల ఇది ఆమ్లతను తగ్గించడం, జీర్ణ ఎంజైమ్‌లను పెంచడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం చికిత్సకు కూడా సహాయపడుతుంది. అంతేకాదు.. కరివేపాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

కరివేపాకు తినడం వల్ల కీళ్ళనొప్పులు, షుగర్ ఉన్నవారిలో ఎముకలని నొప్పిని తగ్గించి ఎముకల్ని బలంగా మారుస్తుంది. కరివేపాకులో ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, దీనిని తీసుకోవడం వల్ల డీటాక్సీఫైయర్‌లా పనిచేస్తుంది. కరివేపాకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య దూరమవుతుంది.

జుట్టు రాలడానికి కారణం కుదుళ్ళు ఆరోగ్యంగా లేకపోవడమే.. ఇందుకు ప్రోటీన్ లోపం, ఐరన్ లోపం. ఈ రెండు లోపాల కారణంగా జుట్టు రాలుతుంది. అయితే, కరివేపాకు తింటే ఈ సమస్యలు దూరమవుతాయి. కరివేపాకులో విటమిన్ బి12, విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

కరివేపాకులో కేలరీలు తక్కువగా ఉంటాయి, కానీ విటమిన్లు A, B, C, E వంటి ముఖ్యమైన పోషకాలతో పాటు కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు..కరివేపాకులోని సువాసన, ప్రశాంతమైన సమ్మేళనాల కారణంగా ఒత్తిడిని తగ్గించడంలో చాలా సహాయపడతాయి.