Beauty Tips: పెదవులు, పాదాల పగుళ్లా.. పొడి చర్మం తేమగా మార్చుకోవడానికి సింపుల్ చిట్కాలు మీ కోసం..

|

Feb 10, 2024 | 10:28 AM

మారుతున్న సీజన్ కు అనుగుణంగా చర్మంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా చలికాలంలో చర్మం మరింత పొడి బారుతుంది. కనుక సీజన్ కు అనుగుణంగా చర్మం తేమగా సౌందర్యంగా కనిపించాలనుకుంటే మెయింటెనెన్స్‌ తప్పనిసరి. సరైన చర్యలు తీసుకుంటే పొడి చర్మం కూడా తేమగా ఉంటుంది. చలికాలంలో చర్మాన్ని ముఖ్యంగా పెదాలు, పాదాల సంరక్షణ ఎలా తీసుకోవాలి.. ఆరోగ్య చిట్కాలు సంరక్షణ ఎలా తీసుకోవాలో తెలుసా.. ఈ సమయంలో సాధారణ మాయిశ్చరైజర్ ఉపయోగించండి. ముఖ్యంగా ఆయిల్ మాయిశ్చరైజర్లను ఉపయోగించండి. ఇది వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. సున్నితమైన చర్మం ఉన్నట్లయితే, ఏదైనా మాయిశ్చరైజర్‌ని ఉపయోగించే ముందు నిపుణుడిని సంప్రదించండి.

1 / 7
ఓ వైపు చలికాలం.. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ఈ కఠినమైన పొడి గాలి శరీర-ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా చర్మం గరుకుగా మారుతుంది. పెదవులు పగలడం ప్రారంభిస్తాయి. కాబట్టి ఈ సమయంలో చర్మం, పెదాల సంరక్షణ చాలా ముఖ్యం.

2 / 7
కాలానుగుణ మార్పుల సమయంలో రెగ్యులర్ స్క్రబ్బింగ్ కూడా ముఖ్యం. ఇది చర్మ రంధ్రాలలో పేరుకున్న మురికిని, ధూళిని తొలగిస్తుంది. ఈ సందర్భంలో హైడ్రేటింగ్ క్లెన్సర్‌తో స్క్రబ్బింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి

3 / 7
చాలా మంది సబ్బుతో ముఖాన్ని కడుక్కుంటుంటారు. అయితే పొడి చర్మం కలిగిన వారు మాయిశ్చరైజర్‌తో కూడిన సబ్బును ఉపయోగించాలి. అప్పుడు చర్మం కరుకుదనం సమస్య ఉండదు. ముఖం కడిగిన తర్వాత, ఖచ్చితంగా క్రీమ్ రాయండి

4 / 7
పగలు బయటకు వెళితే సన్‌స్క్రీన్ రాయడం మర్చిపోవద్దు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ ఎండ వేడి చర్మానికి తీవ్రమైన హానిని కూడా కలిగిస్తుంది. సన్‌టాన్ కావచ్చు. కనుక చలికాలంలోనైనా వేసవిలో నైనా బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ ఉపయోగించండి

5 / 7
పొడి చర్మంతో పాటు పెదవులు పగిలిపోవడం సర్వసాధారణం. అయితే నిర్లక్ష్యం చేయవద్దు. పెదవులపై మాయిశ్చరైజర్ లేదా లిప్ బామ్‌ను క్రమం తప్పకుండా రాయండి

6 / 7
చాలా మంది భిన్నమైన వాతావరణం కారణంగా పాదాల పగుళ్లతో బాధపడుతూ ఉంటారు. దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. పాదాల సంరక్షణ కూడా పెదవులకు అంత ముఖ్యం. బయట నుంచి వచ్చిన తర్వాత పాదాలను బాగా శుభ్రం చేసుకుని క్రీమ్ రాసుకోవాలి. పాదాల సమస్యను నివారించడానికి పెట్రోలియం జెల్లీని ఉపయోగించండి

7 / 7
శరీరంలో విటమిన్ డి లేకపోవడం చర్మ సమస్యలకు దారితీస్తుంది. తెల్లవారు జామున వచ్చే ఎండలో విటమిన్ డీ అధికం. ఇలా కూర్చోవడానికి తగిన సమయం కావాల్సిందే.. లేదంటే విటమిన్ డి పొందడం సాధ్యం కాదు. కనుక చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవచ్చు. అలాగే నీళ్లు ఎక్కువగా తాగాలి. అలాగే కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి