1 / 6
ముఖం నిగారింపు, స్పష్టమైన స్కిన్ టోన్ కోసం చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. అయినప్పటికీ.. ఎలాంటి మార్పు కనిపించదు..అయితే, సాధారణంగా కాలుష్యం, ఒత్తిడి కారణంగా ముఖంపై గ్లో కూడా తగ్గుతుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం మార్కెట్‌లో చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నా.. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా మంది భయపడుతుంటారు. మీరు అందమైన, స్పష్టమైన స్కిన్ టోన్ కలిగి ఉండాలనుకుంటే మీ ఆహారంలో మార్పులు చేసుకోవాలని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు. కొన్ని ఫుడ్స్ మీ చర్మానికి లోతైన పోషణను అందించి.. చర్మాన్ని మెరిసేలా చేయడానికి సహాయపడతాయి. మీ ఆహారంలో ఈ 5 పదార్థాలను తప్పనిసరిగా చేర్చుకుంటే.. మంచి ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..