Beauty Care Tips: మార్కెట్‌లో దొరికే ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసా

|

Nov 11, 2023 | 12:29 PM

ముఖంగా అందంగా కనిపించాలని మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల ఫేస్ ప్యాక్‌లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో ఆ ఫేస్ ప్యాక్ మీ చర్మానికి సరిపోతుందో లేదో చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే ఇంట్లో లభించే పండ్లు, కూరగాయలు, పెరుగు, తేనె, కూరగాయలను ఉపయోగించి సహజమైన ఫేస్ ప్యాక్‌ని తయారు చేసుకోవచ్చు.

1 / 7
ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు స్కిన్ ఏ టైప్ అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. జిడ్డు చర్మం, పొడి బారిన చర్మం..  సాధారణ చర్మం వంటి వాటిని పరిగణలోకి తీసుకుని ఏ రకమైన ఫేస్‌ప్యాక్ ని వేసుకోవాలో నిర్ణయం తీసుకోవాలి. 

2 / 7
మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఫేస్ ప్యాక్‌లను ఉపయోగిస్తున్నప్పుడు.. చర్మానికి సరిపోతుందో లేదో తనిఖీ చేయడం మర్చిపోవద్దు. ఫేస్ మాస్క్ ఏదైనా సరే.. సరిగ్గా అప్లై చేయాలో తెలుసుకోవాలి.  

3 / 7
ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు, మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవడానికి తేలికపాటి క్లెన్సర్‌ని ఉపయోగించండి. మృదువైన బ్రష్‌ని ఉపయోగించి ముఖం, మెడ చుట్టూ ఫేస్‌ప్యాక్ మిశ్రమాన్ని అప్లై చేయాలి. అయితే ఈ మిశ్రమాన్ని కళ్ళు, పెదవులపై అప్లై చేయవద్దు.

4 / 7
ఎక్స్‌ఫోలియేటింగ్ ఫేస్ మాస్క్‌ని ఉపయోగిస్తుంటే.. కొన్ని నిమిషాల పాటు వృత్తాకార కదలికలలో వేళ్లతో చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయాలి. 

5 / 7
ఫేస్ ప్యాక్ ఆరిపోయే వరకు 15-20 నిమిషాలు వేచి ఉండండి. సాధారణంగా ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మంపై చాలా త్వరగా ఆరిపోతుంది. అయితే యాంటీ ఏజింగ్, హైడ్రేటింగ్ మాస్క్‌లను ఎక్కువసేపు ఉంచాలి.

6 / 7
ఫేస్ ప్యాక్‌ను కడగడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. సులభంగా శుభ్రపరచడానికి మీరు మృదువైన కాటన్ వస్త్రాన్ని కూడా ఉపయోగించవచ్చు. లేదా స్టోర్లలో లభించే ఫేస్ ప్యాక్ బ్రష్‌తో మీ ముఖాన్ని మసాజ్ చేయడం ద్వారా కూడా శుభ్రం చేసుకోవచ్చు.

7 / 7
ఫేస్ ప్యాక్ కడిగిన అరగంట తర్వాత టోనింగ్, సీరమ్ అప్లై చేయవచ్చు. మాయిశ్చరైజింగ్, సన్‌స్క్రీన్ లోషన్‌ను అప్లై చేయాలి. 