
అందాల చిన్నది శృతిహాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే, విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది. వరస సినిమాలు చేస్తూ , టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఫేమ్ సంపాదించుకుంది.

అనగనగా ఒక ధీరుడు మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటి సినిమా అంతగా గుర్తింపు తీసుకరానప్పటికీ, తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు చాలానే వచ్చాయి. అయితే అందులో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ, గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.

ఇక ఈ మూవీ తర్వాత శృతి హాసన్ వెనక్కి తిరిగి చూడలేదు. వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు రావడంతో సినిమాలు చేస్తూ సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ వచ్చింది. రేసుగుర్రం, ఎవడు, శ్రీమంతుడు, ఆగడు, వకీల్ సాబ్, వీరనరసింహ రెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్, కూలీ ఇలా స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ వరసగా సినిమాలు చేయడమే కాకుండా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో కుర్రకారి మతిపొగొడుతూ ఉంటుంది. తాజాగా స్టైలిష్ లుక్‌లో అదిరిపోయే డ్రెస్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. బ్లాక్ డ్రెస్‌లో సోఫోలో కూర్చొని పలు ఫొటోలకు ఫోజులిచ్చింది.

అందులో ఈ అమ్మడును చూస్తే మతిపోవాల్సిందే, అంత అందంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.