- Telugu News Photo Gallery Bangalore Chennai Expressway: Nitin Gadkari gives a major update about Malur section
Nitin Gadkari: ఈ రహదారి పూర్తయితే కేవలం 3 గంటల్లోనే ప్రయాణం.. ఫోటోలు షేర్ చేస్తూ కీలక అప్‌డేట్ ఇచ్చిన మంత్రి నితిన్ గడ్కరీ
కేంద్ర భూ రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చిత్రాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. బెంగళూరు-మలూరు సెక్షన్ పనులు ఎలా సాగుతున్నాయి? మంత్రి నితిన్ గడ్కరీ ప్రాజెక్టుకు సంబంధించిన..
Updated on: Jul 25, 2023 | 4:32 PM

కేంద్ర భూ రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చిత్రాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. బెంగళూరు-మలూరు సెక్షన్ పనులు ఎలా సాగుతున్నాయి? మంత్రి నితిన్ గడ్కరీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను, ఇతర సమాచారాన్ని ఫోటోలతో సహా పంచుకున్నారు.

ప్రస్తుతం 1160 కోట్ల ఖర్చుతో బెంగళూరు-మలూరు మధ్య పనులు కొనసాగుతున్నాయని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్ వేతో వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.

భారత్ మాల పథకం కింద ఈ ఎక్స్‌ప్రెస్ వే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మూడు రాష్ట్రాల గుండా వెళుతుంది. దీని వల్ల ప్రజలకు మరింత మెరుగైన రవాణా సదుపాయం కలుగుతుందని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను రూపొందించేందుకు కట్టుబడి ఉన్నామని నితిన్ గడ్కరీ ట్వీట్‌లో తెలిపారు.

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే పనులు పూర్తయితే బెంగళూరు-చెన్నై మధ్య ప్రయాణ సమయం 3 గంటలు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఎక్స్‌ప్రెస్ వే కారణంగా ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుందని అన్నారు.





























