Dandruff Solution for Men: మగవారు ఇది మీ కోసమే.. ఇలా చేస్తే తలలో చుండ్రు ఒక్క దెబ్బకు వదిలిపోతుంది

Updated on: Feb 10, 2024 | 8:38 PM

చలికాలంలో చుండ్రు సమస్య మరింత పెరుగుతుంది. ఇక బిజీ లైఫ్‌లో చుండ్రు తొలగింపుకు చాలా మంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. దీంతో తలలో చుండ్రు, దురద మరింత పెరుగుతోంది. యాంటీ-డాండ్రఫ్ చికిత్స కోసం సెలూన్‌కి వెళితే, ఆ ఒక్కసారికి బాగానే ఉంటుంది. ఆ తర్వాత సమస్య యథాతథంగా కొనసాగుతుంది. క్రమం తప్పకుండా సెలూన్‌లో 5-6 ట్రీట్‌మెంట్లు తీసుకుంటే తప్ప చుండ్రు సమస్య తగ్గుముఖం పట్టదు. సహజసిద్ధంగా చుండ్రు సమస్యను తొలగించుకోవాలంటే ఈ కింది టిప్స్‌ ఫాలో అవండి..

1 / 5

2 / 5
మహిళలు ఎక్కువగా చుండ్రు నివారణ కోసం పార్లర్‌కు వెళ్తుంటారు. కానీ మగవాళ్లకు అంత సమయం, ఓపిక ఉండదు. వారు షాంపూ-కండీషనర్‌కు మించిన సౌందర్య సాధనాలను కూడా పెద్దగా ఉపయోగించరు. అయితే ఇటువంటి వారు చుండ్రు నుంచి బయటపడటానికి సులభమైన పరిష్కారం సూచిస్తున్నారు నిపుణులు.

3 / 5
చుండ్రు సమస్యతో బాధపడుతుంటే, మొదట చేయవలసిన పని తలకు నూనె రాసుకోవడం. తలకు నూనె రాస్తే చుండ్రు దరి చేరదు. అలాగే చుండ్రు నివారణకు యాంటీ డాండ్రఫ్ షాంపూని ఉపయోగించవచ్చు. షాంపూ చేసేటప్పుడు స్కాల్ప్‌ను బాగా స్క్రబ్ చేయాలి. ఇది చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. బేకింగ్ సోడా కూడా ఉపయోగించవచ్చు.

4 / 5
బేకింగ్ సోడాను యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఇది చుండ్రును నియంత్రించడంతో పాటు స్కాల్ప్ pH స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. వారానికి 2-3 రోజులు ఈ ట్రిక్ పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. బేకింగ్ సోడాను ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెతో కలిపి మందపాటి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంతో తలను స్క్రబ్ చేసుకోవాలి. ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచి షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు ఇట్టే పోతుంది.

5 / 5
బేకింగ్ సోడా చుండ్రుకు వన్ స్టాప్ సొల్యూషన్. ఇది స్కాల్ప్‌పై తేలికపాటి ఎక్స్‌ఫోలియెంట్‌గా పనిచేసి మృతకణాలను తొలగిస్తుంది. స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్, దురదను తగ్గిస్తుంది. అలాగే బేకింగ్ సోడాలోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.