Avocado for Women: అమ్మాయిల ఆరోగ్యానికి అవకాడో.. ఏడాదికి ఒక్కసారైనా తినాల్సిందే

Updated on: Aug 04, 2025 | 8:00 AM

అవకాడో పోషకాలు దండిగా ఉండే పండు. ఇది మహిళల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. అవకాడోలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి చాలా అవసరం. ఇది పీరియడ్స్‌ను క్రమబద్ధీకరించడంలోనూ సహాయపడుతుంది. మహిళలకు అవకాడో వల్ల కలిగే ఇతన ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
ఇది దాదాపు చక్కెర రహితం. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే డయాబెటిక్ రోగులకు ఇది సూపర్ ఫుడ్. ఇందులోని ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధిక సమయం కడుపు నిండుగా ఉంచుతాయి. దీంతో ఆకలిని తగ్గిచి, కేలరీల నియంత్రణను సులభతరం చేస్తుంది. అవకాడోను ఎవరు తినకూడదు.

2 / 5
అయితే అవకాడోలో ఎన్ని సుగుణాలు ఉన్నప్పటికీ అందరికీ సమానంగా మేలు చేయదు. అవును.. కొందరికి ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

3 / 5
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ సగం అవకాడో (సుమారు 50-70 గ్రాములు) తింటే సరిపోతుందని అంటున్నారు. గుండె, మధుమేహ రోగులు దీన్ని రెగ్యులర్ డైట్‌లో ఉంచుకోవచ్చు. కిడ్నీ, లివర్ రోగులు మాత్రం వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీనిని తినాలి. అవకాడో నిస్సందేహంగా 'సూపర్‌ఫుడ్'. కానీ ఇది అందరికీ ఒకేలా మేలు చేయదనే విషయం మర్చిపోకూడదు.

4 / 5
అవకాడోలో కొవ్వు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, దానిలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. కిడ్నీ రోగులు దీనిని మితంగా తినాలి. ఎందుకంటే ఇందులో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మూత్రపిండాల సమస్యలు ఉంటే ఇందులోని అదనపు పొటాషియం శరీరానికి హానికరం కావచ్చు. లాటెక్స్ అలెర్జీలు ఉన్నవారు వీలైతే దానిని నివారించాలి. అలాగే కాలేయ సమస్యలకు కూడా ఇది అంత మంచిది కాదు.

5 / 5
Avocado

Avocado