Charminar: చార్మినార్ చెంత సరికొత్త సొబగులు.. మీరు చూసారా ??

| Edited By: Phani CH

Jul 18, 2023 | 6:18 PM

భాగ్యనగరంలో చారిత్రక సౌధం చార్మినార్. శతబ్దాల దాటిన చెరగని ఆకర్షణతో పర్యాటకులను ఇట్టే కట్టిపడేసి అలనాటి అందాల చార్మినార్. నాలుగు మినార్ లతో హైదరాబాద్ అనగానే ప్రపంచానికి గుర్తొచ్చే చిహ్నం చార్మినార్. ప్రతికోణంలోనూ నాలుగు మినార్ లు ప్రతిబింబించేలా ఆనాటి నిర్మాణ కౌశల్యాన్ని కళ్లకు కడుతోంది.

1 / 5
భాగ్యనగరంలో చారిత్రక సౌధం చార్మినార్. శతబ్దాల దాటిన చెరగని ఆకర్షణతో పర్యాటకులను ఇట్టే కట్టిపడేసి అలనాటి అందాల చార్మినార్. నాలుగు మినార్ లతో హైదరాబాద్ అనగానే ప్రపంచానికి గుర్తొచ్చే చిహ్నం చార్మినార్. ప్రతికోణంలోనూ నాలుగు మినార్ లు ప్రతిబింబించేలా ఆనాటి నిర్మాణ కౌశల్యాన్ని కళ్లకు కడుతోంది.  టూరిస్ట్ స్పాట్ గానే కాదు.. దేశ వారసత్వ సంపదగా వెలుగొందుతోంది. అలాంటి చార్మినార్ చెంత త్వరలో సరికొత్త సొబగులు అద్దుకోనున్నాయి. ఇంతకీ ఎంటా సొబగులు..? ఎలాంటి మార్పులతో చార్మినార్ కు పునర్ వైభవం తీసుకురాబోతున్నారు.?

2 / 5
చారిత్రక చార్మినార్ వద్ద ట్రాఫిక్ రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. చార్మినార్ కు చేరాలంటే ట్రాఫిక్ తిప్పలు షరా మాములే. అంతేనా అక్కడికి వెళ్లాక కూడా నడక దారి నుంచి రోడ్ అంతా ఫుల్ రష్. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చార్మినార్ పెడస్ట్రనైజేషన్ ప్రాజెక్ట్ (సీపీపీ) ను తీసుకురానుంది. చార్మినార్ చారిత్రక ప్రాంగణ పునురుద్ధణ పేరుతో చార్మినార్ వద్ద నాలుగువైపుల నుంచి వచ్చే వారికి ఫుట్ పాత్ తో పాటు ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్ ల నుంచి వచ్చే ట్రాఫిక్ ను క్రమపద్ధతిలో పెట్టేలా ప్లాన్ ను ప్రతిపాదించారు.

3 / 5
ఈ ప్లాన్ లో భాగంగా ఔటర్ రింగ్ నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్ ను మీర్ ఆలం మండి రోడ్, మెహింది రోడ్, , బౌలి రోడ్ చాదర్ ఘాట్ నుంచి తీసుకురానున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల నుంచి మెఘల్ పురా రోడ్, కాళీకమాన్ రోడ్, లోధిఖాన్ రోడ్  ల మీదుగా తీసుకొస్తారు. ఈ రోడ్ మీదుగా ఔటర్ రింగ్ కనెక్షన్ ఎలాగో ఉండనుంది. ఇన్నాళ్లు జిగ్ జాగ్ గా వచ్చే వాహనాలతో చార్మినార్ పరిసరాలు ట్రాఫిక్ తో పాటు పోల్యుషన్ స్పాట్ గా మారిపోయింది.

4 / 5
చార్మినార్ వద్ద నాలుగు రోడ్లకు అసలైన పునర్వైభవం తీసుకొచ్చేలా ఆర్చ్ ఆకారంలో కమాన్ లు, చెక్కతో ఓపెన్ విండోస్ వంటి వాటితో ఎంతో ప్రసిద్ధి చెందిన షాపింగ్ వీధులకు కళను తీసుకొచ్చేలా ప్లాన్ ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చార్మినార్ పరిరక్షణలో భాగంగా చుట్టు బఫర్ జోన్ క్రియేట్ చేసి పాదాచారుల మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. గుల్జార్ హౌజ్-చార్ కమాన్, చార్మినార్ -లాడ్ బజార్-మోతిగలి జంక్షన్, చార్మినార్ - పారిస్ కార్నర్ జంక్షన్, చార్మినార్- సర్దార్ మహల్ వైపు పాదాచారుల ట్రాఫిక్ మేనేజ్మంట్ ప్లాన్ చేశారు.

5 / 5
ఈ సీపీపీ ప్రాజెక్టలో భాగంగా చార్మినార్ తో పాటు సమీపంలోని నాలుగు కమాన్ లు, ఫతేర్గట్టి తోరణం, సర్దార్ మహల్  వంటి సాంస్కృతిక వారసత్వ కట్టడాలకు సైతం పరిరక్షణతో పాటు పునర్వైభవం తీసుకొచ్చేలా ప్రతిపాదనలు చేశారు.  ఈ చార్మినార్ పెడస్ట్రేయన్ ప్రాజెక్టు అమలు కోసం ప్రఖ్యాత కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ అభా నారాయణ్ లంబాను ప్రభుత్వం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.  అన్ని విభాగాల భాగస్వామ్యంతో త్వరలోనే ఈ సీపీపీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.