
నిద్రపోయే ముందు మూత్ర విసర్జన చేయించాలి: పిల్లలు నిద్ర పోతారనే సమయానికి ముందు.. వాళ్లని టాయిలెట్ కి తీసుకెళ్లాలి. ఇలా చేయడం వల్ల వాళ్లు బ్లాడర్ కాస్త ఖాళీ అవుతుంది. దీంతో పక్క తడిపేందుకు అవకాశం తగ్గుతుంది. మధ్య రాత్రి మీరు టాయిలెట్ లేచినప్పుడు.. పిల్లల్ని కూడా నిద్ర లేపి.. టాయిలెట్ కి తీసుకెళ్లాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

పడుకునే ముందు నీటిని ఇవ్వకూడదు: పడుకునే ముందు పిల్లలకు ఎక్కువగా నీటిని ఇవ్వకూడదు. దీని వల్ల వారి బ్లాడర్ ఫుల్ అయి.. నిద్రలో పక్క తడిపేస్తారు. కాబట్టి పడుకునే ముందు అతిగా నీరు త్రాగించకండి. లేదంటే మాత్రం రాత్రుళ్ళు పక్క తడపడం కాయం.

పనిష్మెంట్ ఇవ్వకండి: కొంత మంది పిల్లలు భయంతో కూడా పక్క తడుపుతూంటారు. కాబట్టి పడుకునే ముందు వారిని తిట్టడం, పనిష్మెంట్స్ ఇవ్వడం వంటివి చేయకూడదు. దీనివల్ల వారు భయపడిపోతారు. అప్పుడు టాయిలెట్ వచ్చిన మిమ్మల్ని నిద్ర లేపడానికి భయపడతారు. అప్పుడు పక్క తడిసిపోతుంది.

టాయిలెట్ వస్తే లేపమని చెప్పాలి: మూత్రం వచ్చినప్పుడు లేపమని పేరెంట్స్.. పిల్లలకు చెప్పాలి. లేపినప్పుడు వాళ్లను చిరాకు పడకూడదు. పిల్లలకు ఒక్కసారి చెప్తే సరిపోదు. పిల్లలకు గ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి.. ఏ విషయానైనా పదే పదే చెబుతూ ఉండాలి. అప్పుడే వారు అర్థం చేసుకుంటారు.

ఎక్స్ పర్ట్స్ ని కలవండి: పక్క తడిపే సమస్య మరీ ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మేలు. వారు ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అవసరమైతే మెడికల్ హెల్ప్ తీసుకోండి.