
పెదవులను మృదువుగా మార్చడం కోసం లిప్‌స్టిక్ ఉపయోగించవచ్చు. తద్వారా పెదవులు తరచూ హైడ్రేట్‌గా ఉంటాయి. తేమగా, అందంగా కనిపిస్తాయి. లిప్‌స్టిక్ ఒక సౌందర్య సాధనం మాత్రమే కాదు. ఇది మహిళలకు ఆత్మ విశ్వాసాన్ని, ఆకర్షణను పెంచుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే లిప్‌స్టిక్ పెట్టుకునే వారు కాన్ఫిడెంట్‌గా ఉంటారని అంటారు.

కొన్ని లిప్‌స్టిక్‌లు మాయిశ్చరైజింగ్, సన్‌స్క్రీన్ గుణాలను కలిగి ఉండటంతో అవి పెదాలను సూర్యరశ్మి, గాలి, చలి నుండి కాపాడతాయి. షార్ప్, బోల్డ్, డ్రమాటిక్ కలర్స్ లేదా నేచురల్ లిప్‌స్టిక్ వంటివి మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. పది మందిలో మీరు ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది.

కొన్ని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి కాటన్ బాల్ అందులో వేసి బాగా నానబెట్టాలి. అనంతరం దానితో పది నుంచి పదిహేను నిమిషాల పాటు పెదాలపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల తెల్లమచ్చలు సులభంగా తొలగిపోతాయి.

పెదవులను ఎండ, వేడి నుంచి రక్షించడంలో లిప్‌స్టిక్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. తద్వారా పెదవులు పొడిబారకుండా కాపాడుతుంది. యూవీ కిరాణాల ప్రభావం పెదవులపై పడకుండా చూస్తుంది. లిప్‌స్టిక్ పెట్టుకోవడం వల్ల కళ్లకు కూడా అందం వస్తుందట. లిప్‌స్టిక్ ఉపయోగించడం వల్ల కళ్లపై ఎదుటివారి ఫోకస్ పెరిగి కళ్లు పెద్దగా, అందంగా కనిపిస్తాయి.

యాపిల్ సైడర్ వెనిగర్‌లో కాటన్ బాల్‌ను ముంచి పెదవులపై మచ్చలున్న ప్రదేశంలో అప్లై చేయాలా. పది నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పెదవుల మరకలు ఉన్న ప్రదేశంలో ఆలివ్ ఆయిల్ రాసి గంటసేపు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హోం రెమెడీని రోజుకు రెండు లేదా మూడు సార్లు అప్లై చేస్తే మచ్చలు సులువుగా తొలగిపోతాయి.