
పుచ్చ గింజల్లోని పప్పులో మనకి కావల్సిన అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఈ పప్పును తింటే పలు వ్యాధులు నయం అవుతాయి. ఒక గుప్పెడు పుచ్చ గింజల పప్పును తింటే సుమారుగా 150 క్యాలరీల మేర శక్తి లభిస్తుంది. అలాగే ఇవి తీసుకొంటే 14 గ్రాములు ఆరోగ్యకరమైన కొవ్వులు, 5 గ్రాములు పిండి పదార్థాలు, 3 గ్రాములు ఫైబర్, బి విటమిన్లు నియాసిన్, ఫోలేట్, థయామిన్, బి6, విటమిన్ ఇ, మెగ్నిషియం, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, కాపర్, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి.

పుచ్చ గింజల పప్పులో ప్రోటీన్లు అధికంగా ఉన్నందున నాన్ వెజ్ తినని వారికి ప్రోటీన్లకు మంచి మూలం. ఇవి కండరాల మరమ్మత్తు, నిర్మాణానికి ఎంతగానో సహాయపడతాయి. అలాగే కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి కూడా ఉపయోగపడతాయి. కణజాల అభివృద్ధికి దోహదం పడతాయి. అలాగే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఈ పప్పులో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ అనే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. బీపీ సమస్య తగ్గుముఖం పడుతుంది. రక్త నాళాల్లో అడ్డంకులు తొలగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీని హార్ట్ ఎటాక్ రాదు. హైబీపీ ఉన్నవారికి ఈ పప్పు ఎంతగానో మేలు చేస్తుంది. బీపీని నియంత్రణలో ఉంచుతుంది.

పుచ్చ గింజల పప్పులోని అధికంగా లభించే జింక్, ఐరన్, విటమిన్ ఇ రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇది శరీరం ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా రోగాలను దూరం చేస్తుంది. అలాగే గాయాలు, పుండ్లు కూడా త్వరగా నయం అవుతాయి. సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు, జ్వరం సమస్యలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు కూడా పుచ్చ గింజల పప్పును రోజూ గుప్పెడు మోతాదులో తినవచ్చు.

పుచ్చ గింజల పప్పులో మెగ్నిషియం, ఫాస్ఫరస్, కాపర్ అధికంగా ఉన్నందున ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఏదైన ప్రమాదంలో విరిగిన ఎముకలు ఇది తింటే త్వరగా అతుక్కుంటాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే వృద్ధాప్యంలో వచ్చే ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకం దూరం చేస్తుంది. ఇవి రాత్రంతా నీటిలో నానబెట్టి బ్రేక్ ఫాస్ట్‌లో తింటే శక్తి లభిస్తుంది. అలగే ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు.