
గజ్జల్లో, పిరుదుల వద్ద దురద వచ్చే సమస్యని చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. ఇంట్లో పర్వాలేదు కానీ.. నలుగురిలో బయట ఉన్నప్పుడు ఈ దురద చికాకు పెడుతుంది. దీంతో చాలా సతమతమవుతూ ఉంటారు. కానీ రుద్దు కోకపోతే ఇంకా చికాకుగా అనిపిస్తుంది. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యతోనే ఇబ్బంది పడుతున్నారు.

బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు గానీ, ఇతర మధ్య గానీ గజ్జల్లో దురద వస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా గజ్జల్లో, పిరుదుల మధ్య దురద రావడానికి ప్రధాన కారణం ఇన్ ఫెక్షన్. అలాగే బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవడం వల్ల కూడా దురద వస్తూ ఉంటుంది.

టైట్ గా ఉండే బట్టలు వేసుకోవడం వల్ల చెమట అక్కడే పేరుకు పోయి ఫంగల్ ఇన్ ఫెక్షన్లు మరింత పెరుగుతాయి. ఈ కారణంగా మంట, దురద అనేవి సవ్తాయి. ఈ సమస్యని ముందుగానే నియంత్రించక పోతే.. మరింత తీవ్రతరం అవుతుంది. ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు వేపాకుతో అదుపు చేయవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

వేపాకులో చర్మ సమస్యలన్ని నియంత్రించే గుణాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వేప నూనె లభ్యమవుతుంది. రాత్రి పడుకునే ముందు దురద ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వేప నూనెని రాసి.. అలానే వదిలేయాలి. ఉదయం లేచాక శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

అలాగే తేనె రాసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ప్రతి రోజూ పడుకునే ముందు కాటన్ వస్త్రాలను ధరించడం చాలా మంచిది. కాస్త లైజుగా సౌకర్యవంతంగా ఉండే బట్టలు వేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.