
ప్రస్తుతం కుక్కర్ అనేది దాదాపు అందరి ఇళ్లలో కూడా ఉంటుంది. కుక్కర్ వల్ల వంటలు ఫాస్ట్‌గా, సింపుల్‌గా అయిపోతాయి. రుచిగా కూడా ఉంటాయి. కుక్కర్‌లో వంట చేయడం చాలా సులభం. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటెమ్స్ త్వరగా అవుతాయి. అందుకే చాలా మంది వీటిని ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే కుక్కర్‌లో కొన్ని రకాల వంటలు అస్సలు వండకూడదన్న విషయం మాత్రం ఎవరికీ తెలీదు. దీని వల్ల అనారోగ్య సమస్యలవు వచ్చే అవకాశాలు ఉన్నాయట. అయితే ఇవి వెంటనే ప్రభావం చూపవు. నెమ్మదిగా ఎఫెక్ట్ చూపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

పాస్తా అంటే చాలా మందికి ఇష్టం. పాస్తా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. పాస్తాను పొరపాటున కూడా కుక్కర్‌లో వండకూడదు. ఎందుకంటే ప్రెజర్ కుక్కర్‌లో ఇది వండటం వల్ల దాని కన్సెస్టెన్సీ పాడైపోతుంది. దీన్ని పాన్ లో చేయడమే బెటర్.

డెయిరీ ఫుడ్స్‌ని పొరపాటున కూడా కుక్కర్‌లో వండకూడదు. ప్రెజర్ కుక్కర్‌లో వండటం వల్ల వాటి రుచి, టెక్చర్ అంతా మారిపోతుంది. దే విధంగా బ్రెడ్‌తో తయారు చేసే ఆహారాలు కూడా కుక్కర్‌లో వండకూడదు. దీని వల్ల బ్రెడ్ ఐటెమ్స్ రుచి మారిపోతుంది. అంతేకాకుండా వంట కూడా సరిగ్గా రాదు.

పిల్లలు ఈజీగా తినేస్తారు. కానీ ఏవైనా డిసర్ట్ వంటివి చేయడానికి మాత్రం కుక్కర్‌లో ఉడక బెట్టకూడదు. వాటి రుచి కోల్పోతాయి.