
లవంగాలలో యూజినాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. లవంగాలు దంతాలు, చిగుళ్ళకు కూడా ఉపయోగపడతాయి. అందువల్ల మీరు భోజనం తర్వాత లవంగాలను కూడా తినవచ్చు.

సోంపు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కొంత మంది రాత్రంతా నీళ్లలో నానబెట్టిన సోంపు నీటిని తయారుచేసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగుతుంటారు. ఇలా సోంపు గింజనలు నానబెట్టి తాగడం వల్ల ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తుంటారు. ఇందులో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం..

భోజనం తర్వాత పుదీనా ఆకులను తినవచ్చు. పుదీనా ఆకులు నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రాత్రి భోజనం తర్వాత 2-3 పుదీనా ఆకులను నోటిలో ఉంచుకోవడం వల్ల దుర్వాసన తొలగిపోతుంది. అయితే ఆమ్లత్వంతో బాధపడేవారు నిపుణుడిని సంప్రదించకుండా పుదీనా ఆకులను తినకూడదు.

సోంపు గింజలు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా మందికి భోజనం తర్వాత సోంపు గింజలు తినే అలవాటు ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, బరువు తగ్గడానికి కూడా వీటిని తీసుకుంటారు.

భోజనం తర్వాత సోంపు తినే అలవాటు జీర్ణక్రియను మెరుగుపడుతుంది. అదే విధంగా రాత్రంతా నానబెట్టిన సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగినా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయట. సోంపు నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు నోటి దుర్వాసన తగ్గుతుంది. బరువు తగ్గడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.