
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో యాపిల్స్ ముఖ్యమైనవి. అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కొన్ని రోజులకే అవి పాడైపోతుంటాయి. యాపిల్స్ పై నల్ల మచ్చలు ఏర్పడి, కుళ్ళిపోతుంటాయి.

దీంతో తాజా యాపిల్స్ కొన్న కొద్ది రోజుల్లోనే పాడైపోతాయి. అయితే కొన్ని ట్రిక్స్ తెలిస్తే యాపిల్స్ ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు యాపిల్స్‌ను ఎక్కువ కాలం నిల్వ ఉంచాలనుకుంటే, వాటిని సూర్యకాంతికి దూరంగా ఉంచాలి. దీని కోసం రిఫ్రిజిరేటర్ లోపల కూరగాయల బాక్స్‌లో ఉంచాలి.

అలా భద్రపరిచేటప్పుడు, వాటిని కొద్దిగా తడిగా ఉన్న పేపర్‌లో చుట్టి, పాలిథిన్ సంచిలో ఉంచాలి. పాలిథిన్ సంచిలో చల్లటి గాలి లోపలికి వచ్చేలా చిన్న చిన్న రంధ్రాలు చేయాలి.

యాపిల్‌ను ఉంచే ఫ్రిజ్‌లోని బాక్స్‌లో ఇతర పండ్లు లేదా కూరగాయలు ఉంచకూడదు. ఎందుకంటే యాపిల్స్ ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. ఫలితంగా ఇతర పండ్లు, కూరగాయలను త్వరగా కుళ్ళిపోతాయి. యాపిల్ కొనుగోలులో చేసేటప్పుడు త్వరగా పాడయ్యే వాటిని కొనకూడదు.

రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడానికి అనువైన ఉష్ణోగ్రత 30 నుంచి 35 డిగ్రీల ఫారెన్‌హీట్. ఒకేసారి చాలా యాపిల్స్ కొంటే హడావుడిగా భద్రపరచకుండా.. వీలైనంత శుభ్రమైన ప్రదేశంలో నిల్వ చేయాలి. వార్తాపత్రిక లేదా క్రాఫ్ట్ పేపర్‌లో ఒక్కొక్కటిగా చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే చాలా కాలం పాటు నిల్వ చేయవచ్చు.