AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో ఈశాన్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.

Anand T
|

Updated on: Nov 07, 2026 | 2:13 PM

Share
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ వాతావరణ శాఖ తెలిపింది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

1 / 5
ఏపీ, యానాంలో వర్ష సూచన: ముఖ్యంగా కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఆది,సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

2 / 5
రాయలసీమలోనూ వర్షాలు: ఇక రాయలసీమ ప్రాంతంలో కూడా రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, మెరుపులు సంభవించవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది

3 / 5
తెలంగాణలో ఈ జిల్లాలకు అలర్ట్:  ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

4 / 5
అలాగే ఈ జిల్లాల్లో వర్షాల సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనించాలని సూచించింది.

5 / 5
Follow Us